cops under cage : ఐపీఎస్ పక్షులు Andhara ptabha Analysis

cops under cage : ఐపీఎస్ పక్షులు Andhara ptabha Analysis
- రాజకీయ పగ – అరెస్టుల పరంపర
- పాట్నా కోర్టులో ఏపీ పోలీసులకు చీవాట్లు
- కస్టోడియల్ టార్చర్ కేసులో కొత్త మలుపులు
- నిబంధనల ఉల్లంఘన – చట్టపర పరిణామాలు
- పోలీసుల సర్వీస్ రికార్డుపై బ్లాక్ మార్క్ ప్రభావం
- పాట్నా హైకోర్టు – సుప్రీంకోర్టు బాట
- నాన్-బైలబుల్ వారెంట్ ప్రయత్నాలు
- హైకోర్టు ఆశ్రయంలో ఐపీఎస్ లు
- కుల రాజకీయాల ఎంట్రీ
- ఫోరెన్సిక్ ఆధారాల సేకరణ వేగవంతం
- జగన్‌కు నోటీసులు ఎప్పుడు?
( ఆంధ్రప్రభ, ఏపీ న్యూస్ నెట్ వర్క్ ప్రతినిధి(
బీహారీ గిరిజన బిడ్డ.. ఐపీఎస్ అధికారి ఎం. సునీల్ కుమార్ నాయక్ అరెస్టు పర్వంలో.. అలవాటులో పొరబాటుతో. పాట్నా కోర్టు లో ఏపీ పోలీసులకు చీవాట్లు, అక్షంతలు తప్పలేదు.. అందరూ మేటీ పోలీసు అధికారులే. వీరి అధిపతీ అసమాన్యుడే. కానీ ఇతర రాష్ట్రానికి వళ్లి ఓ పోలీసు అధికారిని అరెస్టు చేసి ట్రాన్సిట్ పిటీషన్ వేసే ప్రక్రియలో . కోర్టుకు ఏమి సమర్పించాలి, ఏ పత్రాలు దాఖలు చేయాలి ?, వాట్ డూ.. వాట్ కెనాట్ డూ? అనే అతి సామాన్య విషయం తెలియని తనం వీరిని దద్దమ్మలు చేసిందంటఏ కేవలం ఆరోపణ కాదు సర ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడ్దాం.
cops under cage | రా.జకీయ పగ ప్రతీకారం..

2014 తరువాత ఏపీ రాజకీయాల్లో కక్ష, కార్పణ్యం తారాస్థాయికి చేరుకున్నాయి. మరీ ముఖ్యంగా 2019 నుంచి పగ ప్రతీకారం .. ఏ స్థాయికి చేరాయంటే.. పోలీసు కేసులు, అరెస్టుల కథలు సీక్వెల్స్ ..ట్విస్టుల మీద టిస్టులతో నరాలు తెగే సస్పెన్స్ థ్లిల్లర్ మూవీలను క్రియేట్ చస్తన్నాయి. అపపల్లో బందరు తెలుగుదేశం నాయకుడు, మాజీ మంత్త్రి కొల్లు రవీంద్ర అరెప్టుతో ప్రారంభైన పోలీసు స్టోరీ.. దేశద్రోహం కేసులో ఎంపీ రఘురామ కృషంరాజు అరెస్టు , టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును రాజమండ్రి జైలుకు సీఐడీ అధికారులు తరలింపుతో.. సానుభూతి పర్వం ముగిసింది. ఇప్పుడు కూటమి సర్కారు కూడా అరెస్టు పర్వంలో బిజీబిజీగా మారింది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ , మాచర్ల పిన్నెల్లి బ్రదర్స్ ..అంబటి రాంబాబు సహా వైసీపీ దిగ్గజాల అరెస్టులే పరమావిధిగా పోలీసు శాఖ పని చేస్తోంది. అంటే.. అప్పుడు, ఇప్పుడు రాజకీయ పడగ కింద పోలీసు బంట్రోతులు సతమతం అవుతున్నారంటే.. అతిశయోక్తి కాదు. ఎందుకంటే ప్రమోషన్లు కావాలి, రిటైర్ మెంటు నాటికి నోట్ల కట్టలు మూటగట్టుకోవాలి. ఈ టార్గెట్ తోనే గొప్ప గొప్ప పోలీసు అధికారులు జీవిత చరమాంకంలో .. చరీత్రహీనులవుతున్నారు. ఇందుకు ఎన్నో ఎన్పెన్నో ఉదాహరణలే సాక్ష్యం.
cops under cage | పోలీసులే బకరాలు

తాజాగా ఏపీ ఉప సభాపతి, మాజీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ..ప్రధాన నిందితుల్లో ఒక్క వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మినహా మిగిలిన నిందితులందరూ పోలీసులే. ఈ కేసులో తాము అమాయకులమని పోలీసులు గగ్గోలు పెడుతుంటే.. అనేక సాక్ష్యాలతో బాధితులు కోర్టు తలుపులు తట్టుతున్నారు. ఈ వ్యవహారం ఎంత దూరం ..ఎంతకాలం సాగుతుందో గానీ.. పొలిటికల్ టార్చర్ లో పోలీసు బిడ్డలు మాత్రం అల్లాడి సోతున్నారనే నిజం.. నిజం. పాట్పా కోర్టు దయతో రఘు రామకృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసు నుంచి ఐపీఎస్ కోర్టు సునీల్ నాయక్ 30 రోజులు తప్పించుకోవచ్చుగాక.. కోర్టు మొట్టికాయలతో ఏపీ పోలీసులు బిక్కచచ్చిపోవచ్చుగాక.. కానీ ఏపీ కూటమి సర్కారు కళ్లు మూసుకోదు. ఈ కేసులో మాజీ సీఎం వైఎస్ జగన్ ను జైలుకు పంపే వరకూ నిద్ర పోదు.. కాపపోఎతే కాస్త ఆలస్యం అంతే.. ఔను.. జగన్ మోహన్ అరెస్టఏ కూటమి టార్గెట్.. అదెలా అంటే..
cops under cage | చిక్కుల్లో ఏపీ పోలీసులు.
బీహార్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ నాయక్ కేసులో పాట్నా కోర్టు ఏపీ పోలీసుల తీరుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. న్యాయపరమైన నిబంధనల ఉల్లంఘన (Procedural Lapses) జరిగినట్లు నిర్ధారణ జరిగితే , అరెస్టు ఐపీఎస్ ను చేసిన పోలీసులపై కఠిన చర్యలు తప్పవు. అక్రమ నిర్బంధం (Wrongful Confinement) కింద కేసు నమోదు చేస్తారు. అరెస్ట్ వారెంట్ లేకుండా లేదా సరైన పద్ధతి పాటించకుండా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుంటే, అది భారతీయ న్యాయ సంహిత (BNS) (గతంలో IPC సెక్షన్ 342) ప్రకారం నేరం.. దోషులుగా తేలితే పోలీసు అధికారులకు జైలు శిక్ష లేదా జరిమానా పడే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు నిర్దేశించిన డీకే బసు (D.K. Basu) మార్గదర్శకాలను (అరెస్టు సమయంలో పాటించాల్సిన నియమాలు) ఉల్లంఘించినట్లు తేలితే, సంబంధిత పోలీసులపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవచ్చు. పాట్నా కోర్టులో ఏపీ పోలీసులు తెలుగులో పత్రాలు సమర్పించడం స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడాన్ని ఇప్పటికే కోర్టు తప్పుబట్టింది కాబట్టి, ఈ అంశంపై కోర్టు సీరియస్ అయ్యే అవకాశం ఉంది.
cops under cage | పోలీసు రికార్డుల్లో బ్లాక్ మార్క్
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు సంబంధిత అధికారులపై AP Police , ప్రభుత్వం అంతర్గత విచారణ జరిపి సస్పెన్షన్ వేయవచ్చు. అధికారుల సర్వీస్ రికార్డులో ఇది ఒక “బ్లాక్ మార్క్”గా మిగిలిపోతుంది, ఇది అధికారుల ప్రమోషన్లపై ప్రభావం చూపుతుంది. సునీల్ నాయక్ తాను ఎస్టీ (ST) వర్గానికి చెందిన వాడినని, తనను వేధిస్తున్నారని ఇప్పటికే ఆరోపించారు. ఒకవేళ ఆయన జాతీయ ఎస్సీ/ఎస్టీ కమిషన్ లేదా మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తే, ఏపీ పోలీసులపై అట్రాసిటీ కేసులు లేదా విచారణ మొదలయ్యే అవకాశం ఉంది. అక్రమ అరెస్టు వల్ల తన ప్రతిష్టకు భంగం కలిగిందని సునీల్ నాయక్ ఏపీ పోలీసులపై పరువు నష్టం దావా వేసి భారీ పరిహారం కోరే అవకాశం కూడా ఉంటుంది. పాట్నా సివిల్ కోర్టు ఇప్పటికే ఏపీ పోలీసుల ట్రాన్సిట్ రిమాండ్‌ను తిరస్కరించడమే కాకుండా, వారిపై బీహార్ పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని సూచించినట్లు సమాచారం. ఇది అమలులోకి వస్తే ఏపీకి చెందిన ఎస్పీ దామోదర్ బృందం చిక్కుల్లో పడే అవకాశం ఉంది.
cops under cage | బీహార్ పోలీసులు గరం గరం

పాట్నా పోలీసులు ఇప్పటికే ఈ ఘటనపై అంతర్గత నివేదిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
ఒక ఐపీఎస్ అధికారిని (ప్రస్తుతం బీహార్‌లో పనిచేస్తున్న అధికారి ) వేరే రాష్ట్ర పోలీసులు వచ్చి నిబంధనల విరుద్ధంగా తీసుకెళ్లడం అనేది తమ ఆత్మగౌరవానికి విఘాతంగా బీహార్ పోలీసు శాఖ భావిస్తోంది. అక్కడి ఐపీఎస్ అధికారుల అసోసియేషన్ కూడా ఈ విషయంపై గనరంగరంగా ఉంది, ఇక బీహార్‌లో ప్రస్తుతం నితీష్ కుమార్ నాయకత్వంలోని ఎన్డీయే (NDA) ప్రభుత్వం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎన్డీయే భాగస్వామ్య పక్షాలే (టీడీపీ-జనసేన-బీజేపీ) అధికారంలో ఉన్నాయి. సాధారణంగా రెండు రాష్ట్రాల్లో ఒకే కూటమి ప్రభుత్వాలు ఉన్నప్పుడు, ఇలాంటి వివాదాలను రాజకీయంగా సర్దుబాటు చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఒక రాష్ట్ర పోలీసులు మరో రాష్ట్ర పోలీసులపై కేసులు పెట్టుకోవడం అనేది పరిపాలనాపరంగా ఇబ్బందికరంగా మారుతుంది.
cops under cage | పాట్నా హైకోర్టులో ఏపీ అప్పీల్..
పాట్నా సివిల్ కోర్టు (లోయర్ కోర్టు) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఏపీ పోలీసులు పాట్నా హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. నిందితుడిని ఆంధ్రప్రదేశ్‌కు తరలించడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ‘క్వాష్’ (Quash) పిటిషన్ లేదా రివిజన్ పిటిషన్ దాఖలు చేస్తారు. తెలుగులో పత్రాలు ఇవ్వడం వంటి చిన్న చిన్న సాంకేతిక లోపాలను (Technical glitches) సవరించుకుని, సరైన అనువాద ప్రతులతో మళ్లీ దరఖాస్తు చేస్తారు. ఒకవేళ పాట్నా హైకోర్టులో కూడా ఊరట లభించకపోతే, ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది.
cops under cage | కొత్త వారెంట్ జారీ
పాట్నా కోర్టు “అరెస్ట్ వారెంట్ లేదని” అభ్యంతరం తెలిపింది కాబట్టి, ఏపీ పోలీసులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని సంబంధిత కోర్టు (గుంటూరు కోర్టు) నుండి నాన్-బైలబుల్ వారెంట్ (NBW) పొంది, దానితో మళ్లీ బీహార్‌కు వెళ్లి చట్టబద్ధంగా అరెస్టు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. పాట్నా కోర్టు సునీల్ నాయక్‌కు 30 రోజుల పాటు రక్షణ కల్పించింది. ఈ 30 రోజులు ముగిసిన వెంటనే ఏపీ పోలీసులు మళ్లీ ఆయన్ని అదుపులోకి తీసుకోవడానికి సిద్ధమవుతారు. ఈ లోపు సునీల్ నాయక్ ముందస్తు బెయిల్ (Anticipatory Bail) కోసం ప్రయత్నించవచ్చు. ఐపీఎస్ అధికారులు కేంద్ర సర్వీసులకు చెందిన వారు కాబట్టి, ఇద్దరు ఐపీఎస్ అధికారుల మధ్య (ఏపీ వర్సెస్ బీహార్) జరుగుతున్న ఈ వివాదంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA) జోక్యం చేసుకునే అవకాశం ఉంది. నిబంధనల ఉల్లంఘనపై విచారణ జరిపి నివేదిక కోరవచ్చు.
ప్రస్తుత పరిస్థితి: ఏపీ ప్రభుత్వం ఇప్పటికే తమ న్యాయ నిపుణులతో చర్చిస్తోంది.
cops under cage | హైకోర్టు బాటలో ఐపీఎస్ లు

రఘురామ కృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న పి.వి. సునీల్ కుమార్ (A1) మరియు పి.ఎస్.ఆర్. ఆంజనేయులు (A2) ప్రస్తుతం తమ అరెస్టును అడ్డుకోవడానికి, న్యాయపరమైన చిక్కుల నుండి బయటపడటానికి ముందస్తు జాగ్రత్తలపై దృష్టి సారించినట్టు ప్రచారంజరుగుతోంది. బీహార్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ అరెస్టు ప్రయత్నం జరిగిన వెంటనే, వీరు తమ అరెస్టు కూడా జరిగే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సునీల్ నాయక్ కేసును ఉదాహరణగా చూపడం: పాట్నా కోర్టు ఏపీ పోలీసుల తీరును తప్పుబట్టడాన్ని వీరు తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. “పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు, మాకు రక్షణ కల్పించండి” అని కోర్టును కోరుతున్నారు.

తమపై నమోదైన ఎఫ్ఐఆర్ (FIR) చట్టవిరుద్ధమని, ఇది పూర్తిగా రాజకీయ కక్షతో కూడుకున్నదని పేర్కొంటూ కేసును కొట్టివేయాలని వీరు ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు అనుమతి (Sanction): ఒక ఐపీఎస్ అధికారిపై క్రిమినల్ కేసు విచారణ జరపాలంటే కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం నుండి సెక్షన్ 197 CrPC ప్రకారం ముందస్తు అనుమతి ఉండాలని, కానీ ఈ కేసులో అది తీసుకోలేదని ప్రధానంగా వాదిస్తున్నారు. సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చినప్పుడు, వీరు నేరుగా హాజరుకాకుండా తమ న్యాయవాదుల ద్వారా వివరణలు పంపిస్తున్నారు.

ఆరోగ్య కారణాలు లేదా ఇతర వ్యక్తిగత కారణాలను చూపుతూ విచారణకు హాజరు కావడానికి సమయం కోరుతున్నారు. తద్వారా అరెస్టును సాధ్యమైనంత వరకు వాయిదా వేయాలని చూస్తున్నారు. ఐపీఎస్ అధికారులుగా తమకు ఉండాల్సిన గౌరవాన్ని, ప్రోటోకాల్‌ను ఏపీ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని వీరు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA) కి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తమపై జరుగుతున్న విచారణ నిష్పక్షపాతంగా లేదని, కేసును వేరే రాష్ట్రానికి లేదా స్వతంత్ర సంస్థకు బదిలీ చేయాలని కోరుతున్నారు.
cops under cage | తెరపై కులం
ఈ కేసులో ఇద్దరు నిందితులు.. ఐసీఎస్ ఆఫీసర్లు తాజా గా కులం రకులం కార్డును ప్రయోగిస్తున్నారు. ఇప్పటికే సునీల్ నాయక్ తన ట్విట్టర్ ఖాతాలో .. తాను దళితుడుని కావటంతోనే తప్పుడు కేసులతో వేధిస్తున్నారని పోట్టు వదిలారు. ఇక పి.వి. సునీల్ కుమార్ కూడా సోషల్ మీడియా వేదికగా తాను దళిత వ్యతిరేక శక్తులకు లక్ష్యంగా మారానని ఆరోపిస్తున్నారు. ఇది రాజకీయంగా సామాజికంగా ఒత్తిడి పెంచడానికి చేస్తున్న ప్రయత్నంగా విశ్లేషకులు భావిస్తున్నారు.
cops under cage | ఆధారాల సేకరణలో .. బిజీబిజీ

సిఐడి పోలీసులు ఈ కేసులో ఫోరెన్సిక్ ఆధారాలను అత్యంత కీలకంగా భావిస్తున్నారు, ఎందుకంటే 2021లో జరిగిన ఘటనకు ఇప్పుడు భౌతిక ఆధారాలు సేకరించడం సవాలుతో కూడుకున్న పని. ఆర్మీ హాస్పిటల్ రిపోర్ట్: రఘురామ కృష్ణరాజును అప్పట్లో సికింద్రాబాద్‌లోని ఆర్మీ హాస్పిటల్లో పరీక్షించినప్పుడు, ఆయన కాళ్లపై వాపులు మరియు గాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఆ రిపోర్టును ఇప్పుడు కీలక సాక్ష్యంగా ఫోరెన్సిక్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆ గాయాలు లాఠీలతో కొట్టడం వల్ల కలిగాయా లేక రబ్బరు బెల్టుల వల్ల కలిగాయా అనే అంశంపై క్లినికల్ ఫోరెన్సిక్ అభిప్రాయాన్ని పోలీసులు కోరారు. సీసీటీవీ ఫుటేజ్: గుంటూరు సీఐడీ కార్యాలయంలోని పాత సీసీటీవీ రికార్డులను పునరుద్ధరించే (Retrieve) ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ డేటా డిలీట్ అయి ఉంటే, హార్డ్ డిస్క్‌లను సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (CFSL) కి పంపారు. కాల్ డేటా రికార్డ్స్ (CDR): నిందితులైన అధికారుల (సునీల్ కుమార్, ఆంజనేయులు, విజయ్ పాల్) ఫోన్ కాల్స్ డేటాను విశ్లేషిస్తున్నారు. రఘురామ కృష్ణరాజు కస్టడీలో ఉన్న సమయంలో వీరు ఒకరితో ఒకరు లేదా సీఎం క్యాంప్ ఆఫీస్‌తో మాట్లాడిన వివరాలను సేకరిస్తున్నారు. రఘురామ గారు తన ఫిర్యాదులో పేర్కొన్న విధంగా.. తన ఛాతిపై కూర్చుని వేధించడం వల్ల అంతర్గత గాయాలు ఏమైనా అయ్యాయా అనే దానిపై ఎకో (ECHO) మరియు ఇతర హృదయ సంబంధిత పాత మెడికల్ రిపోర్టులను రీ-ఎగ్జామిన్ చేస్తున్నారు. అప్పట్లో సీఐడీ అధికారులు రఘురామను ప్రశ్నించిన వీడియోలు ఏమైనా ఉంటే, వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌లో పరీక్షించి, ఎక్కడైనా ఎడిటింగ్ జరిగిందా లేదా వాయిస్ మార్చారా అనేది నిర్ధారించనున్నారు.

cops under cage | జగన్ కు నోటీసులు ఎప్పుడు?
ఈ కేసులో వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి (A3) నోటీసులు ఇచ్చేందుకు లేదా విచారణ జరిపేందుకు పోలీసులు సేకరించిన సాక్షుల వాంగ్మూలాలే (Witness Statements) ప్రధాన ప్రాతిపదిక అవుతాయి. 70 మంది సాక్షులు: పోలీసులు ఇప్పటికే దాదాపు 70 మంది సాక్షులను విచారించారు. ఇందులో 17 మంది కీలక సాక్షుల వాంగ్మూలాలను మేజిస్ట్రేట్ ముందు సెక్షన్ 164 CrPC కింద రికార్డ్ చేశారు. కోర్టులో విచారణ సమయంలో వీటికే అత్యంత విలువ ఉంటుంది. నేరపూరిత కుట్ర (Section 120B): జగన్ నేరుగా దాడిలో పాల్గొనకపోయినా, అధికారుల ద్వారా ఆయన ఈ చర్యలకు ‘కుట్ర’ పన్నారనేది ప్రధాన ఆరోపణ.
అధికారుల వాంగ్మూలాల్లో (ముఖ్యంగా అరెస్టయిన విజయ్ పాల్ లేదా సస్పెన్షన్ లో ఉన్న సునీల్ కుమార్) జగన్ ప్రమేయం గురించి ఏవైనా ఆధారాలు లభిస్తే, అది ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు బలమైన కారణంగా మారుతుంది. ప్రస్తుతం జగన్ హైకోర్టు నుండి అరెస్టు కాకుండా రక్షణ (No Coercive Action) ఉంది. అయితే, పోలీసులు సేకరించిన సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా ఆయనను విచారణకు హాజరుకావాలని కోరుతూ సెక్షన్ 41A CrPC కింద నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఈ వాంగ్మూలాల్లో జగన్ గారి ఆదేశాల మేరకు “లైవ్ వీడియో” చూశారని రఘురామ కృష్ణరాజు చేసిన ఆరోపణలు నిజమని సాక్షులు చెబితే, అది కేసులో కీలక మలుపు అవుతుంది.
ALSO READ : IPS REMAND : అయ్యో పీఎస్ లూ.. Andhra Prabha Detail Report
