5 percent | జీఎస్టీ ప్రయోజనాలు అందేలా చూడాలి

5 percent | జీఎస్టీ ప్రయోజనాలు అందేలా చూడాలి

5 percent | నాగాయలంక, ఆంధ్రప్రభ : జీఎస్టీ 2.0 ప్రయోజనాలు ప్రజలకు అందేలా నిరంతరం పర్యవేక్షించాలని టీడీపీ నేత, ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మత్స్యకారుల సేవా సమితి ప్రధాన కార్యదర్శి లకనం నాగాంజనేయులు అధికారుల(officers)ను కోరారు. గురువారం ఆయన మత్స్యకారుల నాయకులు నాగిడి తాతారావు, కర్రి కృష్ణమూర్తిలతో కలిసి నాగాయలంకలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ వద్ద చేపల వలల అల్లుతున్న మత్స్యకారులను క‌లిశారు.

ఈ సంద‌ర్బంగా జీఎస్టీ ప్రయోజనాలు అందుతున్నాయా ? లేదా అని అడిగి తెలుసుకున్నారు. మత్స్య ఉపకరణాలపై గతంలో ఉన్న 18శాతం జీస్టీని మత్స్యకారుల సంక్షేమం దృష్ట్యా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 5 శాతానికి(5 percent) తగ్గించిన అంశాన్ని వారు మత్స్యకారులకు వివరించారు.

వేట ఉపకరణాలు కొనుగోలు చేసినప్పుడు రశీదు తప్పని సరిగా తీసుకోవాలన్నారు. అన్ని వాణిజ్య, వ్యాపార సంస్థల వద్ద జీఎస్టీ తగ్గింపుతో కూడిన ధరల పట్టికలు ఏర్పాటు చేయాలన్నారు. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా కృషి సేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వంలో జీఎస్టీ ఫలాల ప్రయోజనాలు ప్రజలందరికీ అందాల్సిందేలా అందరూ కృషి చేయాలని కోరారు.