Chemicals | వారు ఒప్పుకుంటే ఇంత రచ్చ ఉండదు

Chemicals | వారు ఒప్పుకుంటే ఇంత రచ్చ ఉండదు

Chemicals | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కల్తీ నెయ్యి వ్యవహారంలో దోషులు ఎవరున్నా శిక్ష పడాల్సిందేనని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ… లడ్డూకోసం వినియోగించిన నెయ్యిలో నెయ్యే లేదన్నారు. కల్తీ పై గత పాలకులు ఒప్పుకుంటే ఇంత రచ్చ ఉండదన్నారు.

కెమికల్స్ నుంచి నెయ్యి తీయొచ్చని వాళ్లు నిరూపించారన్నారు. బాధ్యులపై గత పాలకమండలి చర్యలు తీసుకుని ఉండాల్సిందన్నారు. నచ్చిన సంస్థలకు టెండర్ల కోసం నిబంధనలు మార్చారన్నారు. ఇలాంటి తప్పు మరో మతంలో జరిగితే గగ్గోలు పెట్టేవారన్నారు.

Chemicals |

కల్తీ నెయ్యిలో ఏ రసాయనాలు వాడారో ఆ పెరుమాళ్లకే తెలియాలన్నారు. జంతు సంబంధిత రసాయనాలు ఉన్నాయని ఎన్‌డీడీబీ రిపోర్టు చెప్పిందన్నారు. అది నెయ్యే కాదని సీబీఐ రిపోర్టు ఇచ్చిందన్నారు. ఇది వెంకటేశ్వర స్వామికి కాకుండా వేరే ఏ మతానికి జరిగినా ప్రపంచమంతా గగ్గోలు పెట్టేదన్నారు.

Leave a Reply