ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతంగా చేపట్టండి..

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు లబ్ధిదారులు వేగవంతంగా చేపట్టాలని ఊట్కూర్ మండల గృహ నిర్మాణ శాఖ ఏఈ బి. ప్రేమ అన్నారు. మంగళవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని పులిమామిడి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గూడు లేని పేద ప్రజలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిందని ఇండ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు దశలవారీగా బిల్లులు చెల్లిస్తామని అన్నారు.
పులిమామిడి గ్రామానికి 41 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా 18 బేస్మెంట్, 4 ఇండ్లుచెత్తులెవెల్,3 ఇల్లు సజ్జల వరకు నిర్మాణ పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. పనులు చేపడుతున్న లబ్ధిదారులకు బిల్లులు సకాలంలో చెల్లించే విధంగా చూస్తామని ప్రజా ప్రతినిధులు ఇందిరమ్మ కమిటీ సభ్యులు గ్రామాల్లో ఇళ్ల నిర్మాణ పనులువేగవంతంగాచేపట్టేందుకు సహకరించాలన్నారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గృహ నిర్మాణశాఖప్రభుత్వంనిబంధనల ప్రకారం సహాయంచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
