నాగర్ కర్నూల్‌లో దారుణం..

నాగర్ కర్నూల్‌లో దారుణం..

  • జాతరలో పసికందు మృతి
  • అగ్రకుల నిందితుల అరెస్టుకు డిమాండ్

నల్లబెల్లి, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ జిల్లాలోని కుమ్మేర మల్లన్న జాతరలో రెండు నెలల పసికందును అత్యంత దారుణంగా చిదిమేసి హత్య చేసిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. రశీదు అడిగినందుకు ఓ కుటుంబంపై దాడి చేసి,వారి పసిబిడ్డను కాళ్లతో తన్ని చంపిన అగ్రకుల పెత్తందార్లపై తక్షణమే హత్యానేరం నమోదు చేసి,నిందితులను అరెస్టు చేయాలని బీసీ హక్కుల సాధన సమితి మండల కన్వీనర్ వైనాల వీరస్వామి డిమాండ్ చేశారు.

నిందితులను అరెస్టు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. మండల కేంద్రమైన నల్లబెల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో వీరస్వామి మాట్లాడుతూ,లక్షల మంది భక్తులు దర్శించుకునే బహుజన మల్లన్న జాతరలో అగ్రకుల పెత్తందార్ల పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. ప్రతీ భక్తుడి దగ్గర వంద రూపాయలు వసూలు చేస్తూ రశీదు ఇవ్వకుండా దందా చేస్తుంటే పోలీసులు,ప్రభుత్వం ఏం చేస్తున్నారని నిలదీశారు.

డబ్బులు వసూలు చేస్తూ రశీదు అడిగినందుకు కీర్తి అనే మహిళపై,ఆమె తల్లి చంద్రకళపై దాడి చేసి దర్శనం చేయకుండా బయటకు పంపడమే కాకుండా,ప్రశ్నించిన కీర్తి సోదరుడు గణేష్‌ను కొబ్బరికాయల గదిలో బంధించి మూడు గంటల పాటు కొందరు రెడ్లు సామూహికంగా కొట్టారని వివరించారు. దయచేయమని వేడుకున్నా కనికరించకుండా,తన రెండు నెలల పసికందును శ్రీనివాస్ రెడ్డి కాళ్ళపై వేసినా,ఆ పసిపాపను కాళ్లతో తొక్కి,తన్ని బయటకు విసిరేయడంతో పాప చనిపోయిందని బాధితులు చెప్పుతున్నారని, అగ్రకుల రాక్షసత్వం ఎంత భయానకంగా ఉందో బహుజనులు ఆలోచించాలన్నారు.

వెంటనే కీర్తి కూతురు హంతకులపై హత్యానేరం నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేయాలని వీరస్వామి డిమాండ్ చేశారు,లేకపోతే ఎస్సీ ఎస్టీ బీసీలందరం ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు,ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల సాంబరావు, అణగారిన వర్గాల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు పరికి కోర్నేలు,రోజుకు సంఘం మండల అధ్యక్షుడు దర్మారపు సాంబయ్య, సిపిఐ మండల కార్యదర్శి కడియాల క్రాంతి కుమార్,సిపిఎం మండల నాయకులు బొడిగె సమ్మయ్య, బీసీ హక్కుల సాధన సమితి మండల నాయకులు మాటూరి హారీష్,లింగయ్య తదితరులు పాల్గొన్నారు

Leave a Reply