నూతన బోరు ప్రారంభించిన సర్పంచ్..

వేల్పూర్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం పరిధిలో సోమవారం రాత్రి వేల్పూర్ మండలంలోని రామన్నపేట్ గ్రామంలో బస్టాండ్ వద్ద తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు నూతన బోరు బావి కి సర్పంచి బేల్దారి నవీన్ కొబ్బరికాయ కొట్టి పూజ చేసి ప్రారంభించారు. అంతరం సర్పంచి బేల్దారి నవీన్ మాట్లాడుతూ ప్రజలకు తాగునీటి సమస్య ఉందని రానున్నది వేసవికాలం కావున ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈరోజు బోరు వేయడం జరిగిందని తెలిపారు.కాలనీ వాసులు, ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గోవర్దన్, వార్డు సభ్యులు శివరాజ్, అనిత, గౌతమీ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply