పసి పాపను చంపిన వారిపై చర్య తీసుకోవాలి…

పసి పాపను చంపిన వారిపై చర్య తీసుకోవాలి…
చిట్యాల, ఆంధ్రప్రభ : రెండు నెలల పసిపాపను తన్ని చంపిన రెడ్ల కులస్తులపై మర్డర్ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘంరాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో సోమవారం పుల్ల మల్లయ్య మాట్లాడుతూ,నాగూర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో ఐదు రోజుల క్రితం సంఘటన జరిగిన నేటి వరకు నిందితులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోకపోవడం బాకరమన్నారు.
సంబంధిత అధికారులు మర్డర్ కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగం కల్పించి వారి కుటుంబాన్ని వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వమే చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు జన్నే యుగేందర్, నాయకులు పాముకుంట్ల చందర్ పాల్గొన్నారు.
