వంజరీ కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలి….

వంజరీ కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలి….
కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : వంజరి కులస్తులను వెంటనే ప్రభుత్వం ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరుతూ కోన సముందర్ గ్రామపంచాయతీ ముందు వంజరి కుల సంఘం సభ్యులు నల్ల జెండాలు,బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాన్ని సోమవారం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంజారా లుగా పిలవబడే మా వంజరి కులాన్ని 1977 హయాంలో 245 జీవో ద్వారా వంజరి కులస్తులను ఎస్టీ జాబితాలో కలపడం జరిగిందన్నారు.
రెండు సంవత్సరాలు గడవక ముందే చిన్నారెడ్డి ప్రభుత్వ హయాంలో ఫిబ్రవరి 23 న జీవో నెంబర్ 44 ద్వారా వంజరి కులస్తులను బీసీ కులాల జాబితాలో మార్చడం జరిగిందన్నారు. దీని ద్వారా వంజరి కులానికి చెందిన విద్యార్థులు చదువు రీత్యా,ఉద్యోగ రీత్యా అన్యాయం జరుగుతుందని అన్నారు.ఫిబ్రవరి 23 న బ్లాక్ డే గా వంజరి కులస్తులం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జీవో నెంబర్ 44 ను తొలగించి యధావిధిగా వంజరి కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ బలెరావు శంకర్, వంజరి సంఘం అధ్యక్షులు ఆమంద్ అశోక్, కార్యదర్శి గడ్డం మహేష్, మాజీ వైస్ ఎంపీపీ కాలేరు శేఖర్, మాజీ ఉపసర్పంచ్ పేరం లింబాద్రి, కొండ నరేష్, భలే రావు ప్రశాంత్, రమేష్, వంజరి కుల సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
