ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతం

ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతం
- 823 మంది గైర్హాజరు
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ :ఇంటర్మీడియట్ (మొదటి సంవత్సరం) సోమవారం జిల్లాలో ప్రశాంతంగా, సంతృప్తికరంగా నిర్వహించబడినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో మొత్తం 75 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష కేంద్రాల్లో కేటాయించిన విద్యార్థుల సంఖ్య 26,925 కాగా, అందులో 26,102 మంది పరీక్షలకు హాజరయ్యారు. 823 మంది గైర్హాజరయ్యారు. పరీక్షా కేంద్రాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని, అన్ని కేంద్రాల్లో ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించబడినట్లు వెల్లడించారు.
విద్యార్థులకు సూచనలు విద్యార్థులు ప్రతి పరీక్షా రోజున ఉదయం 8:30 గంటలకల్లా పరీక్షా కేంద్రానికి చేరుకుని తమకు కేటాయించిన పరీక్షా గదిని పరిశీలించుకోవాలి. ఉదయం 9:00 గంటల తరువాత ఒక నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రం లేదా పరీక్షా గదిలోకి అనుమతి ఇవ్వబడదని స్పష్టం చేశారు. కావున విద్యార్థులు సమయపాలన పాటిస్తూ ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు.



