కుంభం ప్రీతి రెడ్డి జన్మదినం సందర్భంగా అన్న ప్రసాదం పంపిణీ

కుంభం ప్రీతి రెడ్డి జన్మదినం సందర్భంగా అన్న ప్రసాదం పంపిణీ

గట్టుప్పల,ఆంధ్రప్రభ: నల్లగొండ జిల్లా గట్టుప్పల మండలంలోని అంతంపేట గ్రామ పరిధిలోని సోమరాజు గూడలోని సోమేశ్వరాలయంలో బ్రహ్మోత్సవ వేడుకలను ఈరోజు ప్రారంభించారు. దేవాలయాన్ని దీప కాంతులతో అందంగా అలంకరించి వేకువ జాము నుంచే అర్చకులు పూజలు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం దేవాలయ నిర్మాణ దాత కుంభం ప్రీతి రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా గ్రామంలో ప్రజలందరికీ అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ చందా శ్రీలత వెంకటేశం, టియుడబ్ల్యూజే(ఐజేయు) అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి,మాడుగుల వెంకటయ్య,రాచమల్ల వెంకటరెడ్డి,గూడపు జలంధర్,పూసపాటి శంకరప్ప,అయిత గోని భుజంగం,డీలర్ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply