MP Sabari Fire స్వామితో పెట్టుకున్నావ్ Andhra Prabha News

MP Sabari Fire స్వామితో పెట్టుకున్నావ్ Andhra Prabha News
జగన్ ఇక వైసీపీ పతనమే.
శ్రీవేంకటేశ్వరస్వామిని రాజకీయాల్లోకి లాగొద్దు
:
వైసీపీ ఎమ్మెల్సీల ప్రవర్తనపై తీవ్ర ఆక్షేపణ
తిరుమల అంశంపై జగన్‌పై ఘాటు విమర్శలు
దేవాలయాల పరిరక్షణలో వైఫల్యం అంటూ ఆరోపణలు
ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఫైర్
MP Sabari Fire: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామితో పెట్టుకున్నావ్, నీ స్వార్థ రాజకీయం కోసం శ్రీవారిని వాడుకుంటున్నావ్ జగన్ ఇక మీ వైసీపీ పతనం మొదలైనట్లేనని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి పేర్కొన్నారు.ఆదివారం భారత తొలి తిరుగుబాటు యోధుడు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి 179 వ వర్ధంతి సందర్బంగా ఆయనకు నివాళులు అర్పించరు.శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీల ప్రవర్తన చాలా అభ్యంతకరం, ఛిగ్గుచేటన్నారు.
శ్రీ వేంకటేశ్వరస్వామిని వైసీపీ రాజకీయాల్లోకి లాగడం, వాడుకోవడం భాధేస్తోందన్నారు. 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకీ రారు, శ్రీవారిని రాజకీయంగా వాడుకోవడం మహా పాపమన్నారు.
MP Sabari Fire : శ్రీ వేంకటేశ్వరస్వామిని నల్లరాయి అన్న నాస్తికుడు భూమన కరుణాకర్ రెడ్డి కీ టీ టీ డి చైర్మన్ ఇచ్చి వైసీపీ ఎంతో పాపం ముటకట్టుకుందన్నారు.భూమన హిందువు కాదని, ఆయన కూతురు వివాహం ఏ సాంప్రదాయం ప్రకారం చేశారో తిరుపతి, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అన్నారు. మరో వైసీపీ నేత టీ టీ డి చైర్మన్ ఉన్న వై వి సుబ్బారెడ్డి తిరుమలలో గోవిందనామం బదులు బైబిల్ చేత పట్టుకొని జగన్ రక్షకా అంటు తిరుగుతారని విమర్శించారు.వైసీపీ గత ఐదేళ్ల పాలనలో దేవుళ్ళకు, దేవాళయాలకు రక్షణ లేకుండా చేశారన్నారు. తిరుమల దేవాలయ విద్యుత్ అలంకరణలో సిలువను చూపిస్తారు, టీ టీ డి బస్సు టికెట్ల ఫై అన్యమత ప్రచారం చేస్తారు, శ్రీ రాముడి తల తీసి ఎత్తుకెళుతారు, దేవుడి రథం తగలబెడతారు ఆ మహా పాపం వల్లే వైసీపీ 11 సీట్లకు పడిపోయింది. అయినా వైసీపీలో మార్పు రాలేదు, ఆ నాయకులకు బుద్ది రాలేదని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
MP Sabari Fire: శాసన మండలిలో శ్రీవేంకటేశ్వరస్వామినీ పాంప్లేట్లలా మార్చి, కాళ్లకు చెప్పులు, బూట్లు వేసుకొని వైసీపీ ఎమ్మెల్సీ లు ప్రచారం చేయడం, ధర్నా చేయడం, గోవిందా, గోవిందా, జై జగన్ అంటు నినాదాలు ఇది మంచి పద్ధతి కాదని ప్రజలు విమర్శలు చేస్తే మళ్లీ బుకాయిస్తూ చెప్పులు వేసుకోలేదంటారు, అక్కడ మహిళా ప్రతినిధులు వారి ఇళ్లలో నిత్యం పూజలు చేస్తారు, వారికీ ఇది తప్పు అనిపించలేదా, చాలా భాధగా ఉందన్నారు. జగన్ ఒక వైపు రౌడీలను తయారు చేస్తూ, మరో వైపు దేవుళ్లను తిట్టేవాళ్ళను తయారు చేస్తున్నారనీ, జగన్ ఇటీవల మాట్లాడుతూ ఆచితూచి మాట్లాడాలని అంటున్నారని, మాట్లాడడం కాదు జగన్ ఆచి తూచి అడుగులు వేస్తే బాగుపడతావ్ అన్నారు. కొందరు వైసీపీ పిల్ల నాయకులు ఆసుపత్రి కీ, జైలుకు, తిన్నా, పడుకున్నా టీడీపీ నే గుర్తుకు వస్తుందన్నారు, మా ఉమ్మడి పాలన ప్రజా పాలన చేస్తున్నాం కాబట్టే మీకు భయమేస్తోంది, ఇది నిజం మీ వైసీపీ పతనం మొదలైందన్నారు.
