Municipal | నూతన పాలకవర్గం రేపు బాధ్యతల స్వీకరణ..

Municipal | నూతన పాలకవర్గం రేపు బాధ్యతల స్వీకరణ..

  • విజయోత్సవ ర్యాలీ
  • ముఖ్య అతిధిగా పాల్గొననున్న..
  • తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్..

Municipal, మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపాలిటీలో ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో రేపు ఉదయం 9.30 గంటలకు జరిగే బాధ్యతల స్వీకరణతో పాటు కౌన్సిల్ సమావేశంలో పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ హాజరై వారి సమక్షంలో చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపారు.

అనంతరం మున్సిపల్ కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ఎమ్మెల్యే సామెల్ తో కలిసి నూతన చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ల విజయోత్సవ ర్యాలీ, అంబేద్కర్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారని వివరించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు, ఎన్ ఎస్ యూ ఐ, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్,ఎస్సి, ఎస్టీ, ఓబీసీ విభాగం, కార్మిక, అన్ని అనుబంధ సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, సర్పంచ్ లు, అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని మున్సిపల్ చైర్మన్ స్వప్న సోమనర్సయ్య, వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్నలు కోరారు.

Leave a Reply