విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ…

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; నారాయణపేటజిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని పులిమామిడి శ్రీ సాయి విద్యానికేతన్ పాఠశాలలో విద్యార్థులు వివిధ వేషాధారణలో తోటి విద్యార్థులకు విద్యాబోధనలు చేపట్టి శనివారంవిశేషంగా ఆకట్టుకున్నారు. స్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా ప్రజలు విద్యార్థులు తల్లిదండ్రులు సందర్శించి బోధన తీరును తిలకించిఅభినందించారు. కలెక్టర్ గా అదృష్ట, డీఈవోగా అరుణ శ్రీ, ఎంఈఓగా శివకుమార్, హెచ్ఎంగాహరీష్ తో పాటు పలువురు విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం వసంత్ కుమార్, బలరాం, నగేష్, రాధా, యశోద, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply