20 months | హిందూ ధర్మాన్ని అవమానిస్తున్నారు..

20 months | హిందూ ధర్మాన్ని అవమానిస్తున్నారు..
- కూటమి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే విష్ణు ధ్వజం
20 months | పాయకాపురం, ఆంధ్రప్రభ : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. శనివారం అయినా పత్రిక విలేకరులతో మాట్లాడుతూ… దేవుడి పేరుతో రాజకీయ లాభాలు పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. వెంకటేశ్వర స్వామిని బజారుకు ఈడ్చుకెళ్లినట్టుగా వ్యవహరిస్తూ, హిందూ ధర్మాన్ని అవమానించే చర్యలకు కూటమి ప్రభుత్వం పాల్పడుతోంది” అని అన్నారు.
అధికారంలోకి వచ్చిన 20 నెలలు గడిచినా ప్రజల అసలు సమస్యలను పరిష్కరించకుండా, దేవుడి పేరుతో దుష్ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్న కొందరు అధికారులు, పత్రికలను ఉపయోగించి తప్పుదారి పట్టించే ప్రచారం నిర్వహిస్తున్నారని విమర్శించారు.
ప్రజలను తప్పుదారి పట్టించే ఈ విధానాలకు త్వరలోనే ముగింపు పలుకుతారని, రానున్న కాలంలో ప్రజలు కూటమి ప్రభుత్వానికి గట్టి గుణపాఠం చెబుతారని మల్లాది విష్ణు అన్నారు. రాష్ట్రంలో మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వానికి ప్రజలు మద్దతు ఇస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
