నీటి ఎద్దడి నివారణకు చర్యలు

జైనూర్, ఆంధ్రప్రభ : నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు జైనూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కొడప ప్రకాష్ అన్నారు. శనివారం కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలోని వికాస్ సెక్షన్ కాలనీ, శివాజీ నగర్, పవర్ హౌస్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసే బోర్వెల్స్ కు భూమి పూజ చేశారు. రాబోయే వేసవి కాలంలో నీటి ఏద్దడి తలెత్తకుండా ఆయా కాలనీలో నూతన బోర్వెల్స్ ను వేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ డోంగ్రే ప్రకాష్, వార్డు సభ్యులు షేక్ రహీం కాలనీవాసులు పాల్గొన్నారు.

Leave a Reply