Sandhya Theater Case | ఛార్జ్‌షీట్‌ తిరస్కర‌ణ‌

Sandhya Theater Case | ఛార్జ్‌షీట్‌ తిరస్కర‌ణ‌

Sandhya Theater Case | ఆంధ్రప్ర‌భ‌, వెబ్ డెస్క్ : సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి నాంపల్లి కోర్టు దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను తిరస్కరించింది. అల్లు అర్జున్(Allu Arjun) ప్రధాన పాత్రలో నటించిన పుష్ప-2 సినిమా(Pushpa-2 Movie) విడుదల సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌(Sandhya Theater Case) వద్ద భారీ తొక్కిసలాట చోటుచేసుకున్న విషయం తెలిసిందే.

ఈ తొక్కిసలాట ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరొకరు నేటికీ ప్రాణాలతో పోరాటం చేస్తున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే ఛార్జ్‌షీట్ ఫైల్‌ అయ్యింది. అల్లుఅర్జున్‌ సహా 23 మందిపై అభియోగాలు నమోదు చేస్తూ ఛార్జ్‌షీట్‌ వేశారు. అయితే ఈ ఛార్జ్‌షీట్‌లో సాంకేతిక లోపాలున్నాయని కోర్టు పేర్కొంది. హార్డ్ డిస్క్‌లు, సీడీలు, పెన్‌డ్రైవ్‌లు వంటి కీలక ఆధారాలను జతపరచకపోవడమే దీనికి కారణమని కోర్టు తెలిపింది. ఇదివరకే రెండుసార్లు ఛార్జ్‌షీట్‌ను కోర్టు రిటర్న్ చేసింది.

Leave a Reply