స్కూటీని ఢీ కొట్టిన డీసీఎం తండ్రి మృతి, కొడుకుకు తీవ్ర గాయాలు

స్కూటీని ఢీ కొట్టిన డీసీఎం తండ్రి మృతి, కొడుకుకు తీవ్ర గాయాలు
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ మండలంలోని ఎల్లగిరి గ్రామ సమీపంలో పేదరాశి పెద్దమ్మ హోటల్ వద్ద జాతీయ రహదారిపై గురువారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి అక్కడికి అక్కడే మరణించగా కొడుకు తీవ్రంగా గాయపడ్డాడు. ఎస్సై ఉపేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కోటి చుక్కల అశోక్ (20), అతని తండ్రి సుబ్రహ్మణ్యం (48) తో కలిసి తన టిఎస్ 07 ఎకె 2087 గల స్కూటీ పై చోడవరం నుండి హైదరాబాద్ లోని మియాపూర్ టు వెళ్తుండగా మార్గమధ్యలో చౌటుప్పల్ మండలంలోని ఎల్లగిరి గ్రామ శివారులో గల పేదరాశి పెద్దమ్మ హోటల్ దగ్గర మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో స్కూటీ వెనకాల నుండి వస్తున్న గుర్తు తెలియని డీసీఎం డ్రైవర్ అతివేగంగా అజాగ్రత్తగా నడుపుతూ వచ్చి వెనుక నుండి టక్కరి ఇవ్వగా స్కూటీపై నుండి అతడు అతని నాన్న క్రింద పడిపోగా అతని నాన్న తలపై నుండి డీసీఎం వెనుక వైపు ఎడమ టైరు వెళ్లడంతో అతని నాన్న రక్త గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. కొడుకు అశోక్ కుడికాలు పాదానికి రక్తగాయం అయింది. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ ద్వారా చౌటుప్పల్ ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. అశోక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్టుగా ఎస్సై ఉపేందర్ రెడ్డి తెలిపారు.
