ఛత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్ఠాపనకు భూమి పూజ

రుద్రూర్, ఆంధ్రప్రభ ; రుద్రూర్ మండలంలోని చిక్కడపల్లి గ్రామంలో గురువారం చత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్టాపనకు సర్పంచ్ మచ్కూరి రమేష్ ఆధ్వర్యంలో భూమి పూజ గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ సన్మార్గంలో ప్రయాణించాలని పిలుపునిచ్చారు. శివాజీ మహారాజ్ దేశభక్తి, ధైర్య సహసాలకు, నిలువెత్తు ప్రతీక అని కొనియాడారు. శివాజీ విగ్రహం ఏర్పాటు చేయడం యువతకు నిత్యం స్ఫూర్తి దాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి నా రోజీ గంగారం, సర్పంచ్ రమేష్, ఉప సర్పంచ్ కళ్యాణ్, తోట సంగయ్య, గ్రామస్తులు పెద్ద హనుమంతు, డాక్టర్ మల్లేష్, రాము, కురేమే రాజు, జల్లా సాయిలు, అశోక్, రవి, జ్యోతి, సావిత్రి, యువకులు తదితరులు ఉన్నారు.

Leave a Reply