వ్యవసాయ యంత్రాల పంపిణి..

వర్ని, ఆంధ్రప్రభ ; సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకానైజేషన్ పథకం లో భాగం గా అర్హులైన రైతులకు గురువారం వ్యవసాయ యంత్రాలను పంపిణీ చేశారు.మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబా మాట్లాడుతూ, ప్రభుత్వం రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై అందజేస్తూదన్నారు.వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. యంత్రాల వినియోగంతో వ్యవసాయ పనులు వేగవంతం కావడంతో పాటు ఉత్పాదకత పెరుగుతుందన్నారు. మండల వ్యవసాయ అధికారి ఎం. రాజశేఖర్ మాట్లాడుతూ, రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆధునిక పద్ధతులతో సాగు చేసి అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాకోర, వర్ని వ్యవసాయ విస్తరణ అధికారులు వర్ని మాజీ పీఏసీఎస్ చైర్మన్ నామాల సాయి బాబు, వెలగపూడి గోపాల్, అబ్దుల్ బారి, గిరి రైతులు పాల్గొన్నారు.
