7th Ward | కాంగ్రెస్ నేతలు కౌంటింగ్ లో కుట్ర చేసి నన్ను ఓడించారు

7th Ward | కాంగ్రెస్ నేతలు కౌంటింగ్ లో కుట్ర చేసి నన్ను ఓడించారు
వార్డు కౌన్సిలర్ ఫలితం పై తాను కోర్టును ఆశ్రయించాను
7వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి కానుగు యాదమ్మ బాలరాజు
7th Ward | చౌటుప్పల్, ఆంధ్రప్రభ : మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కుట్రచేసి అధికారులతో కలిసి తనను ఓడించారని చౌటుప్పల్ మున్సిపాలిటీ 7వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి కానుగు యాదమ్మ బాలరాజు ఆరోపించారు. బుధవారం కానుగు యాదమ్మ బాలరాజు విలేకరులతో మాట్లాడారు. 7వ వార్డు ఎన్నికల కౌంటింగ్ లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడడంతో తన ఓటమి జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల చేత న్యాయంగా ఎన్నుకోబడిన తనను కౌంటింగ్ శైలిలో అధికారులు మొదట ప్రకటించిన ఫలితాలలో తనను విజేతగా ప్రకటించారని, తరువాత రీకౌంటింగ్ చేసి కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినట్లు అధికారులు ప్రకటించారని తెలిపారు. అధికార పార్టీ నాయకులు, రిటర్నింగ్ అధికారులతో కుమ్మక్కై బ్యాలెట్ పేపర్లు తారుమారు చేసి తనకు పడిన ఓట్లను కాంగ్రెస్ అభ్యర్థికి పడినట్లు బ్యాలెట్ పేపర్లను మార్చారని ఆరోపించారు. మున్సిపాలిటీకి సంబంధంలేని కాంగ్రెస్ పార్టీ నాయకులను కౌంటింగ్ హాల్ లోకి ఎలా అనుమతించారని ప్రశ్నించారు. ఫలితంపై అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని వాపోయారు. ఏడో వార్డు ఫలితం పై న్యాయస్థానం ను ఆశ్రయించినట్లుగా యాదమ్మ బాలరాజు చెప్పారు. ప్రజాస్వామ్యమును అపహస్యం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు తగిన బుద్ధి చెప్పాలని ఆమె కోరారు.
