Students | గోకార్ట్ 3.0 ఎలక్ట్రిక్ వాహనం ఆవిష్కరణ

Students | గోకార్ట్ 3.0 ఎలక్ట్రిక్ వాహనం ఆవిష్కరణ

Students | బాసర, ఆంధ్రప్రభః ఆర్జీయూకేటీ యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం, ఎస్.ఏ.ఈ.ఇండియ ఆర్జీయూకేటీ -బి కొలీజియట్ క్లబ్ ఆధ్వర్యంలో ‘టీమ్ గరుడ’ విద్యార్థుల బృందం రూపొందించిన గోకార్ట్ 3.0 ఎలక్ట్రిక్ వాహనాన్ని యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ గోవర్ధన్ పరిపాలన అధికారి మురళీధర్షన్ ఆవిష్కరించారు. విద్యార్థుల బృందం మోటార్‌స్పోర్ట్స్ బృందం ‘టీమ్ గరుడ’, స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన సరికొత్త గోకార్ట్ బాజా ఆల్-టెర్రైన్ వాహనం పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనమని యూనివర్సిటీ వీసి గోవర్ధన్ పేర్కొన్నారు.


వాహనాల రూపకల్పన, తయారీలో విద్యార్థులు ప్రదర్శించిన అంకితభావం, పట్టుదల, సాంకేతిక నైపుణ్యాన్ని విసి అభినందించారు. ఇటువంటి ప్రయోగాత్మక ప్రాజెక్టులే ఇంజనీరింగ్ విద్య యొక్క నిజమైన స్ఫూర్తిని ప్రతిబింబిస్తాయని పేర్కొన్నారు. బాజా(బి.ఏ.జె.ఏ) ఎస్.ఏ.ఈ.ఇండియ & ఐ.ఎస్.ఎన్.ఇ.ఇ గోకార్ట్ వంటి ఆవిష్కరణలు జాతీయ స్థాయి పోటీల్లో విశ్వవిద్యాలయానికి మంచి పేరు తీసుకు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 3.0గో కార్డు వాహనాన్ని విసి నడిపి చూశారు.
​ఓఎస్‌డి ప్రొఫెసర్ ఇ. మురళీ దర్శన్ మాట్లాడుతూ విద్యార్థుల కృషితో పాటు అధ్యాపకుల సలహా సూచనలు ఉపయోగపడ్డాయని పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవడంలో యూనివర్సిటీ విద్యార్థులు ముందుంటారని పేర్కొన్నారు.

Leave a Reply