support |కష్టాల్లో ఉన్న కుటుంబానికి అండగా నిలిచిన సోషల్ మీడియా

support |కష్టాల్లో ఉన్న కుటుంబానికి అండగా నిలిచిన సోషల్ మీడియా
support | పాలకుర్తి, ఆంధ్రప్రభ: పాలకుర్తి మండలం పుట్నూరు గ్రామానికి చెందిన పడాల సత్యం గౌడ్‌కు ఇటివల జరిగిన రోడ్డు ప్రమాదం అతని జీవితాన్ని ఒక్కసారిగా తారుమారు చేసింది. కుటుంబాన్ని పోషించే స్థితిలో ఉన్న సత్యం, ప్రమాదంలో తన ఎడమ కాలును కోల్పోయి ప్రస్తుతం నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు భార్య సునీత క్యాన్సర్‌తో పోరాడుతూ చికిత్స తీసుకుంటున్నారు. తల్లి, ఇద్దరు పిల్లలతో ఉన్న ఈ కుటుంబం ఇప్పుడు దీన స్థితిలో ఉంది.
ఈ బాధాకర పరిస్థితిని గమనించిన ఈశాల తక్కళ్ళపల్లి గ్రామానికి చెందిన విద్యుత్ ఉద్యోగి ఒడ్నాల సురేష్ సోషల్ మీడియాలో కుటుంబ గాథను పంచుకున్నారు. అతని ప్రయత్నానికి స్పందించిన పలువురు దాతలు మానవీయతతో ముందుకు వచ్చి విరాళాలు పంపించారు. ఈ విధంగా సేకరించిన రూ.60 వేల మొత్తాన్నిసత్యం గౌడ్ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా సహకరించిన ప్రతి ఒక్కరికీ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
