Police | గంపలగూడెం చేరుకున్న సైకిల్ యాత్ర…

Police | గంపలగూడెం చేరుకున్న సైకిల్ యాత్ర…
సైకిల్ యాత్రకు కదం తొక్కిన యువత
నాయకత్వం వహిస్తున్న ఐదుగురు మహిళా పోలీసులకు స్వాగతం పలుకుతున్న మహిళలు
జానపద నృత్యాల ద్వారా అవగాహన
డ్రగ్స్ పై దండయాత్ర…కదం తొక్కిన యువత
గంపలగూడెం చేరుకున్న సైకిల్ యాత్ర
సైకిల్ యాత్రకు అపూర్వ స్వాగతం
డ్రగ్స్ వద్దు.. జీవితమే ముద్దు
Police | గంపలగూడెం,ఆంధ్రప్రభ: డ్రగ్స్ రహిత సమాజం కోసం ముందడుగు వేస్తూ డ్రగ్స్ పై దండయాత్ర అనే నినాదంతో ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్‌లోని అనేక గ్రామాలను కలుపుతూ 35 రోజులు 510 కిలోమీటర్లు చేపట్టే సైకిల్ యాత్ర బుధవారం 23వ రోజు గంపలగూడెం మండలంలోకి అడుగు పెట్టడం జరిగింది.ఈ సైకిల్ యాత్రకు నాయకత్వం వహించే ఐదుగురు మహిళా పోలీసు అధికారులు కె.రేవతి,జి.హైమావతి,ఎస్.కె శైలజ,సిహెచ్.త్రివేణి,వి.ఉషారాణికు పోలీసులు,అధికారులు,నాయకులు,ప్రజాప్రతినిధులు,స్వచ్చంద సంస్థల ప్రతినిధులు,పాఠశాల,కళాశాలల విద్యార్థులు,యువత అపూర్వ స్వాగతం పలికారు.అదనపు పోలీసు కమీషనర్ వై.ప్రసాద్ రావు నేతృత్వంలో సిఐ కె.గిరిబాబు,ఎస్సై జి.అనిల్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమానికి విద్యార్థులు, యువత స్వచ్చందంగా కదం తొక్కారు.
మేము సైతం డ్రగ్స్ రహిత సమాజానికి అని నినదించారు.ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ ప్రజలు,యువత డ్రగ్స్ బారిన పడకుండా వారిలో చైతన్యం తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని అందులో భాగమే సైకిల్ యాత్ర అని స్పష్టం చేశారు.కొంత మంది యువత గంజాయి,ఇతర మత్తు పదార్థాలకు బానిసలుగా మారి తమ జీవితాలను,భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని అన్నారు.గంజాయి,మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని మంచి సమాజ నిర్మాణం మంచి వ్యక్తుల వల్లనే సాధ్యమవుతుందని అన్నారు.
గంజాయిని తరిమికొట్టడానికి సమష్టిగా కృషి చేస్తున్నామని,దీనికి ప్రజల సహకారం కూడా ఉండాలని పిలుపునిచ్చారు.డ్రగ్స్ ఆనవాలు లేకుండా పూర్తిగా నిర్మూలించడమే ప్రభుత్వం ధ్యేయం అని పేర్కొన్నారు.డ్రగ్స్ తీసుకునే వారు,తరలించే వారు ఎవరైనా ఉన్నట్లు గుర్తిస్తే పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.డ్రగ్స్ వినియోగించడం వలన కలిగే నష్టాల గురించి,ఎన్.డి.పి.ఎస్ చట్టాల గురించి వివరించారు.జానపద నృత్యాలు,వివిధ వేషధారణలతో డ్రగ్స్‌ను వ్యతిరేకిస్తూ అవగాహన కల్పించారు.అనంతరం మాదకద్రవ్యాలు వద్దు..జీవితమే ముద్దు అంటూ ప్రతిజ్ఞ చేయించారు.డ్రగ్స్ అలవాటు వద్దు..బంగారు భవిష్యత్తు కావాలి,చెడు వ్యసనాలకు దూరంగా ఉందాం,సే నో టూ డ్రగ్స్ అంటూ నినాదాలు చేస్తూ సైకిల్ యాత్రతో ముందుకెళ్లారు.
తోటమూల వై.జుంక్షన్ లో మానవహారంగా నిలబదిన అనంతరం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆహాగాహన కల్పించారు.గంపలగూడెం మండలంలో ఈ సైకిల్ యాత్ర గంపలగూడెం,పెనుగొలను మీదుగా రాజవరం చేరుకుని 20వ తేదీ సాయంత్రం పూర్తవుతుందని స్థానిక ఎస్సై అనిల్తె లిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ వి. రాజాకుమారి,విద్యాశాఖ అధికారి పి.వి.డియల్. నరసింహారావు, ఐసీడీఎస్ పర్యవేక్షణ అధికారిణి వై.మునిలక్ష్మి,వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగళ్ల లక్ష్మీ అనిత,సర్పంచ్ కోట పుల్లమ్మ,ఉప సర్పంచ్ కొల్లా నాగరాజు,జిల్లా మహిళా సమైక్య కార్యదర్శిని భీమిశెట్టి రామలక్ష్మి,నాయకులు చెరుకూరి రాజేశ్వరరావు,రేగళ్ల వీరారెడ్డి,మానుకొండ రామకృష్ణ,కాజా రవికుమార్,వేముల బాలయ్య,బూరుగు నారాయణ,బిజెపి మహిళా మోర్చా నాయకురాలు వనమా సుజాత,వికాస తరంగని మండల అధ్యక్షురాలు సముద్రాల జ్యోతి,తదితరులు పాల్గొన్నారు.



