కాంగ్రెస్ రాష్ట్ర పెద్దలతో జూమ్ మీటింగు…

పాల్గొన్న డిసిసి ప్రెసిడెంట్ నూతి సత్యనారాయణ గౌడ్…

వైరా ఫిబ్రవరి 18 (ఆంధ్రప్రభ)

కాంగ్రెస్ రాష్ట్ర పెద్దలు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, రాష్ట్ర పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ ల ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల జిల్లా అధ్యక్షులతో నిర్వహించిన .. జూమ్ మీటింగ్లో ఖమ్మం జిల్లా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు యూత్ సత్యనారాయణ గౌడ్ బుధవారం ఉదయం 10:30 గంటలకు
పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఈనెల 21వ తేదీ నుండి పది రోజులు పాటు వికారాబాద్ లో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు, అవసరమైన సామాగ్రిని వెంటబెట్టుకొని తీసుకురావలసిందిగా సమావేశంలో కోరినట్లు నూతి సత్యనారాయణ పేర్కొన్నారు..

పది రోజులు పాటు నిర్వహించే శిక్షణ తరగతులకు ఏఐసిసి అధ్యక్షులు కర్గే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ హాజరవుతున్నట్లు పేర్కొన్నారు.. కొద్దిరోజున కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ హాజరయ్యే విషయాన్ని స్పష్టం చేసినట్లు తెలిపారు.. ఈ శిక్షణా తరగతుల్లో కాంగ్రెస్ పార్టీ నిర్మాణం విధివిధానాలు పార్టీ బలోపేతం తో పాటు భవిష్యత్ కార్యాచరణ పై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు ఆంధ్ర ప్రభుత్వ నూతి సత్యనారాయణ గౌడ్ పేర్కొన్నారు..

Leave a Reply