donor | అల్పాహారం కొరకు నగదు అందజేత

donor | అల్పాహారం కొరకు నగదు అందజేత
donor | వేంసూరు,ఆంధ్రప్రభ: పది విద్యార్థులకు అదనపు పోషకాహారం అందించేందుకు 25 వేల రూపాయల చేయూతగా అందించారు. హైకోర్టు న్యాయవాది మాదిరాజు వాసు రూ.15 వేలు, కంకటి రాములు రూ.10 వేలు అందించి దాతృత్వాన్ని చాటుకుంటారు. పదవ తరగతి విద్యార్థులకు ఉదయం, సాయంకాల సమయాలలో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.
13వ తేదీ నుంచి ప్రభుత్వం విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు నిధులు విడుదల చేసింది. దీనికి మరింత అదనంగా సమీకృత పౌష్టికాహారం అందించేందుకు ఉపయోగించాలని దాతలు కోరారు. దాతలు నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సుధాకరరెడ్డి, ఉపాధ్యాయులు బి.కె నరసింహారావు, లక్ష్మయ్య బాబు, కంకటి రాములు, కంకటి శ్రీనివాసరావు, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.
