Rally | ఘనంగా మాజీ కేసీఆర్ జన్మదిన వేడుకలు

Rally | ఘనంగా మాజీ కేసీఆర్ జన్మదిన వేడుకలు

Rally | జూలూరుపాడు,ఆంధ్రప్రభః తెలంగాణ ప్రాంత ప్రజల అరవై ఏళ్ళ ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేసిన పోరాట యోధుడు,ఉద్యమ నేత కేసిఆర్ అని బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు యల్లంకీ సత్యనారాయణ,వైరా నియోజకవర్గం నాయకులు లకావత్ గిరిబాబు అన్నారు. మంగళ వారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్లో బిఆర్ఎస్ అధినేత,మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు.

బిఆర్ఎస్ నాయకులు యల్లంకీ,గిరిబాబు కేక్ కట్ చేసి కార్యకర్తలకు కేసీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ సత్యనారాయణ, గిరిబాబు మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత ప్రజల స్వరాష్ట్ర సాధన కోసం కేసీఆర్ అలుపెరుగని పోరాటాలకు నాయకత్వం వహించి డిల్లీ మెడలువంచి రాష్ట్రాన్ని సాధించాడన్నారు.2014 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయంతో తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధి,ప్రజల సంక్షేమానికి కృషి చేశారన్నారు.వ్యవసాయానికి సాగు నీటిని అందించేందుకు ప్రాజెక్టులు నిర్మించడాన్నారు. ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మీ,షాది ముబారక్,
వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేసిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందన్నారు.తిరిగి తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ విజయం సాధించి సీఎం గా కేసీఆర్ అధికారం చేపట్టడం ఖాయమని నేతలు ధీమా వ్యక్తం చేశారు.

బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు.కేసీఆర్ జన్మదినం సందర్భంగా పార్టీ కార్యకర్తలు సీట్లు పంపించి చేసి,బాణా సంచా కాల్చి సంబురాలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు చాపలమడుగు రామ్మూర్తి, నాయకులు దుద్దుకూరి నాగేశ్వరరావు,యదలపల్లి వీరభద్రం,మూడు చిట్టిబాబు, మాజీ వైస్ ఎంపీపీ సీతాకుమారి, ధరావత్ దేవిక,ఉప సర్పంచులు బాదావత్ నరేష్,బత్తుల అశోక్, రెడ్డిబోయిన రాము,తాళ్లూరి రామారావు,పురస్తపురవు రామకృష్ణ,పోతురాజు రామారావు,ఇల్లంగి తిరుపతి, బుడిపూడి ప్రతాప్,తాళ్లూరి నవీన్,రాయపాటి వెంకటేశ్వర్లు, మార్కాపురి నరసింహారావు, చెంగల నరసింహారావు,లకావత్ హేమ్ల,బోడా భోజ్య,మాచినేని శేషగిరిరావు,పోగుల నాగభూషణం,బోడా దేవా, బానోత్ బిక్కు,బానోత్ చందర్, కిన్నెర నరసింహారావు,హరిలాల్, మోహన్,హనుమంతరావు, కుంజా రవికుమార్,దొడ్డ చలపతి,ఈసం వెంకటేశ్వర్లు, బచ్చల వంశీ,ముకేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply