స్మైల్ ఆల్వేస్ పౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత నిత్యావసరాలు పంపిణీ
స్మైల్ ఆల్వేస్ పౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత నిత్యావసరాలు పంపిణీ
దమ్మపేట, ఆంధ్రప్రభ : స్మైల్ ఆల్వేస్ పౌండేషన్ ఆధ్వర్యంలో దమ్మపేట మండలం మారుమూల గిరిజన ప్రాంతం పూసుకుంట లో శనివారం పేదలకు ఉచిత నిత్యావసరాలు పంపిణీ చేశారు .సుమారు 10 గ్రామాలలోని 400 కుటుంబాలకు ఉచితముగా 15 రోజులకు సరిపడ నిత్యావసరాలు సరుకులు బియ్యం, పప్పులు, ఉప్పు, కారం పొడి, పసుపు, నూనె సామాగ్రిని పంపిణి చేశారు .
ఈ సందర్భంగా సంస్థ ప్రెసిడెంట్ కోడి సుదామనుడు ,మాట్లాడుతూ గత కోవిడ్ సమయం నుండి ఈ ప్రాంత పేద గిరిజనులకు ప్రతి సంవత్సరం వేసవి కాలం,వర్షా కాలంలో సహాయం చేస్తూ వస్తున్నామన్నారు . ఈ సహాయం వారికి ఆకలిని తీర్చడం కోసం, ఆరోగ్యాన్ని కాపాడటం కోసం ఎంతో ఉపయోగకరము గా ఉంటుందని తెలిపారు.
సంస్థ ప్రోగ్రాం డైరెక్టర్ డా:టి సైలస్ పాల్ మాట్లాడుతూ హైదరాబాద్ నుండి ప్రతి సంవత్సరం రెండు ,మూడు సార్లు ఈ ప్రాంత గిరిజన ప్రజలకు ఈ విధంగా సహాయం చేయడం మాకు ఎంతో సంతోషాన్నిస్తుంది అని తెలిపారు. స్థానిక ప్రతినిథి వెంకటేశ్వర్లు (ఎలీషా) మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఈ విధంగా గొప్పగా జరగడం ఒక పండుగలాగా అనిపిస్తుంది అని, సహాయం అందుకున్న వారి తరపున సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా ఇంకా మంచినీటి బోర్లు, నివాసాలు ఏర్పాటు చేసి ప్రజల కష్టాలు తీర్చాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎలీషా, కెవిన్ తదితరులు పాల్గొన్నారు.
