Emotional కంట తడి పెట్టిన ఎర్రబెల్లి..

Emotional కంట తడి పెట్టిన ఎర్రబెల్లి..

రేవంత్ రెడ్డి దుర్మార్గపు పాలనలో ప్రజాస్వామ్యం నిర్వీర్యం
రాజశేఖర్ రెడ్డి పరిపాలనలో కూడా ఇలాంటి మోసాలు చూడలేదు
రాజకీయాల నుండి తప్పుకోవాలనిపిస్తుంది
పోలీస్ స్టేషన్ లో భావోద్వేగానికి గురైన ఎర్రబెల్లి..
మద్దతుగా వచ్చిన మానుకోట మాజీ ఎంపీ కవిత, డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్

Emotional నర్సింహులపేట, ఆంధ్రప్రభ: రేవంత్ రెడ్డి దుర్మార్గపు పాలనలో ఇలాంటి అక్రమ అరెస్టులు చేయడం పట్ల ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కంటతడి పెట్టి భావోద్వేగానికి గురైయ్యారు. తొర్రూర్ మున్సిపల్ ఎన్నికల ఉద్రిక్తత నేపథ్యంలో దయాకర్ రావును మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల పోలీస్ స్టేషన్ కు తీసుకువస్తుండగా బిఆర్ఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో చేరుకుని పోలీస్ వాహనాన్ని అడ్డగించి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు వెంటనే కార్యకర్తలను చదరగొట్టి ఆయనను పోలీస్ స్టేషన్ కు తరలించారు.

అక్రమ అరెస్టులను నిరసిస్తూ ప్రభుత్వంపై ఎర్రబెల్లి విరుచుకుపడ్డారు. వరంగల్ ఎంపీ కావ్యది వరంగల్ కమిషనరేట్లో ఓటు హక్కు ఉందని అక్కడే వినియోగించుకుంటానని మున్సిపల్ ఎన్నికల కొరకు కమిషనర్ కు రాసిన లేఖలో కూడా పేర్కొన్నారని తొర్రూర్ లో ఎలా వినియోగించుకుంటారని ప్రశ్నించారు. తొర్రూరు ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో మాకు మెజార్టీ ఇచ్చారని టాస్ వేసే క్రమంలో కూడా తమను మోసం చేశారని, మమ్ములను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. తొర్రూర్ లోనే మాకు ఇల్లు ఉందని,మా కార్యాలయం కూడా ఉందని రేవంత్ రెడ్డి పరిపాలన ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా అక్రమ అరెస్టులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

రాజశేఖర్ రెడ్డి పరిపాలనలో కూడా ఇలాంటి మోసాలు తాము ఎన్నడూ చూడలేదని మా కుటుంబ సభ్యులను కూడా పోలీస్ స్టేషన్లో పెట్టారని రాజకీయాల్లో ఉండాలా తప్పుకోవాలా అని అనిపిస్తుందన్నారు. సర్పంచి, ఎంపిటిసిలను కూడా అత్యధికంగా గెలిపించాలని అదే రీతిగా మున్సిపల్ ఎన్నికల్లో కూడా మెజార్టీ తీసుకువచ్చానని కార్యకర్తల కష్టాలు చూస్తుంటే వారికి ఏం సమాధానం చెప్పాలని కంటతడి పెట్టి భావోద్వేగానికి గురయ్యారు. ఈ సమావేశంలో ఆయన వెంట మానుకోట మాజీ ఎంపీ కవిత,డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ నర్సింహులపేట మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మైదం దేవేందర్,మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు గూగులోత్ రవి నాయక్,కొమ్ములవంచ మాజీ సర్పంచ్ దాసరోజు వెంకటేశ్వర్లు,దంతాలపల్లి బిఆర్ఎస్ నాయకులు ఓలాద్రి మల్లారెడ్డి,కుంభం సుధీర్ రెడ్డి,బండి రమేష్,లగ్పతి,బిక్షం రెడ్డి,వెంకన్న తదితరులు ఉన్నారు.

Leave a Reply