Makthal | ఆసుపత్రిలో పండ్లు బ్రెడ్ పంపిణీ..

Makthal | మక్తల్ , ఆంధ్రప్రభ : బీ.అర్.ఎస్ పార్టీ అధినేత ,తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలను మంగళవారం మక్తల్ లో ఘనంగా నిర్వహించారు. కెసిఆర్ జన్మదినం సందర్భంగా నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని శ్రీ.శ్రీ.శ్రీ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయంలో బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు చిన్న హన్మంతు, సీనియర్ నాయకులు చిట్యాల జుబేర్ పాషా ఆధ్వ కెసిఆర్ పేరుపై అర్చన ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామన్న నివాసంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.

ఆ తర్వాత మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు బ్రెడ్డు,పండ్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మక్తల్ మాజీ మున్సిపల్ కౌన్స్లర్లు జగ్గాలి రాములు, ఎరుకలి మొగులప్ప,బిఆర్ఎస్ నాయకులు మన్నన్, మైమూద్, శివారెడ్డి, ఈశ్వర్ యాదవ్, నేతాజీ రెడ్డి, జుట్ల సాగర్,అంబ్రెష్,గుంటి రఘు,మిరాజ్,అభిరామ్ గౌడ్,రాజు,అనిల్ రెడ్డి, గణేష్,వెంకటేష్,అనిల్,జాను,నవీన్ కుమార్, పవన్, జనార్డన్,జహంగీర్, తౌఫిక్,మిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply