Manchiryala| బీఆర్ఎస్, కాంగ్రెస్ ఢీ అంటే ఢీ

Manchiryala| బీఆర్ఎస్, కాంగ్రెస్ ఢీ అంటే ఢీ
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో ఉద్రిక్తత
మంచిర్యాల, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలో ఉద్రిక్తత నెలకొంది. క్యాతనపల్లి మున్సిపల్ కార్యాలయానికి బీఆర్ఎస్, సీపీఐ అభ్యర్థులు భారీ బందోబస్తుతో చేరుకున్నారు. ఎంపీ వంశీకృష్ణ, మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి కాంగ్రెస్ అభ్యర్థులు వచ్చారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. అది కాస్త ముదరడంతో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లాఠీ చార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో పలువురు స్వల్పంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
