నేడు ఓలాలో కుస్తీ పోటీలు..

కుంటాల, ఆంధ్రప్రభ ; ఫిబ్రవరి మండలంలోని ఓలా గ్రామంలో మహాశివరాత్రి పురస్కరించుకొని సూర్యాపూర్ లోని మహాశివరాత్రి మరుసటి రోజు కుస్తీ పోటీలు నిర్వహించగా రెండవ రోజు ఓలా గ్రామంలో ఆనవాయితీగా కుస్తీ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అంతరాష్ట్ర కుస్తీ పోటీలకు మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన మన యోధులు అధిక సంఖ్యలో తరలివచ్చి పోటీకి తలపడతారు. అంతేకాకుండా.. కుస్తీలు తిలకించడానికి పెద్ద సంఖ్యలో తరలివస్తారు. అనంతరం గ్రామస్తులు మరియు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కుస్తీ పోటీలు నిర్వహించనున్నట్టు ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు.

Leave a Reply