Poxo | నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి

Poxo | నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి
నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు
Poxo | పామర్రు, ఆంధ్రప్రభ: నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి ఓ వ్యక్తి పాల్పడిన ఘటన పెదపారుపూడి మండలంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి నిందితుడిని అరెస్టు చేసి పామర్రు పోలీస్ స్టేషన్లో గుడివాడ డిఎస్పీ ధీరజ్ వినీల్ వివరాలు వెల్లడించారు. పెదపారుపూడి మండలానికి చెందిన నాలుగేళ్ల బాలికలపై ఈ నెల 7వ తేదీన లైంగిక దాడి జరిగినట్లు తెలిపారు. ఈ నెల 5వ తేదీన కుటుంబల కలహాల నేపథ్యంలో పుట్టింటికి తల్లి చిన్నారిని తీసుకెళ్లింది. 7వ తేదీ సాయంత్రం పాపకు స్నానం చేయించిన తర్వాత సమీప బంధువు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ నెల 14న పేదపారుపూడి పోలీస్ స్టేషన్లో బాలికల తల్లి ఫిర్యాదు చేసింది. నిందితుడినిపై పోక్సో యాక్టు నమోదు చేసినట్లు డిఎస్పీ తెలిపారు. సోమవారం అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పామర్రు సర్కిల్ ఇన్స్పెక్టర్ వి.శుభాకర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
