Health Fest | టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్ టీఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026

Health Fest | టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్ టీఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026
Health Fest | హైదరాబాద్, ఆంధ్రప్రభ : ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ ఆరోగ్య సంరక్షణ అండ్ వెల్నెస్ సదస్సు టీఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026 ను టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్ నిర్వహించింది. ఆరోగ్య సంరక్షణ భవిష్యత్తును పునర్నిర్మించడంపై దృష్టి సారించిన చర్చలు, సహకార పరివర్తన కోసం విధాన నిర్ణేతలు, వైద్యులు, సాంకేతిక నిపుణులు, పరిశోధకులు, సామాజిక ప్రభావ నాయకులను విజయవంతంగా ఒకచోట చేర్చింది.
ఈసందర్భంగా టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్ సీఈఓ సాయి గుండవెల్లి మాట్లాడుతూ… టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్ ద్వారా, ఆరోగ్య సంరక్షణ అత్యంత అవసరమైన చోట విస్తరించడానికి తాము సాంకేతికతను ఉపయోగిస్తున్నామన్నారు. మెరుగైన వైద్య సేవలను పొందలేనట్టి రోగులను ప్రో బోనో కేర్ అందించే ఆసుపత్రులతో టిఏఎల్ హాస్పిటల్స్ అనుసంధానిస్తుందన్నారు. ఆరోగ్య సంరక్షణ అనేది కేవలం స్థానికంగా మాత్రమే కాదు – అది నిజంగా గ్లోకల్ అని నిరూపిస్తుందన్నారు. తాము ప్రపంచవ్యాప్తంగా వైద్యులను అనుసంధానించే ప్రపంచ వేదిక అయిన టీఏఎల్ మేడోరాను ప్రారంభిస్తున్నామన్నారు. భారతదేశం తమ 1.4 బిలియన్ల మంది ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం కేవలం మూడు మిలియన్ డాలర్లను మాత్రమే ఖర్చు చేస్తున్నందున, సాంకేతికత, సహకారం ఈ అంతరాన్ని – డబ్బు ద్వారా కాదు, ప్రజలు తమ సమయాన్ని, నైపుణ్యాన్ని స్వచ్ఛందంగా అందించడం ద్వారా – తగ్గించగలవని తాము విశ్వసిస్తున్నామన్నారు. హైదరాబాద్‌లోని టి-హబ్‌లో ఈ సమావేశం ప్రారంభమైంది. కర్ణాటక ప్రభుత్వ క్యాబినెట్ మంత్రి ఎన్.ఎస్. బోస్‌రాజు ప్రారంభోపన్యాసం చేశారు.
మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో పెట్టుబడి పెడుతున్న వేళ, ప్రపంచ సవాళ్లను పరిష్కరించడంలో సైతం పెట్టుబడి పెడుతున్నామన్నారు. సాంకేతికత అపారమైన ప్రభావాన్ని చూపగలదన్నారు. గ్రామీణ ప్రాంతంలోని వ్యక్తి కూడా ఆవిష్కరణల మద్దతుతో ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ నుండి ప్రయోజనం పొందవచ్చన్నారు. భారతదేశాన్ని ప్రపంచ ఆవిష్కరణ నాయకుడిగా నిలబెట్టాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. టీఏఎల్ హెల్త్ ఫెస్ట్ వంటి వేదికలు ఈ లక్ష్యాన్ని వేగవంతంగా చేరుకోవటానికి తోడ్పడతాయన్నారు. ఈ ఆవిష్కరణ పర్యావరణ వ్యవస్థను సమర్ధించడానికి, సాంకేతిక పురోగతి ప్రతి పౌరుడికి చేరేలా చేయటానికి కర్ణాటక ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు.
ఏహెచ్ పిఐ వ్యవస్థాపకుడు, ఏహెచ్ పిఐ తెలంగాణ అధ్యక్షుడు గోవింద హరి మాట్లాడుతూ… కొవిడ్ తర్వాత, ప్రభుత్వం, లాభాపేక్షలేని సంస్థలు, ఆసుపత్రుల మధ్య భాగస్వామ్యాలు నాణ్యత, లభ్యత, రెండింటినీ విస్తరించడానికి తప్పనిసరి అయ్యాయని నొక్కి చెప్పారు. డేటా భద్రత, పాలన, జీవిత భవిష్యత్తు అండ్ వ్యాక్సిన్ ఆర్ అండ్ డి లో విప్లవాత్మక ఆవిష్కరణలు, ఎంఆర్ఎన్ఏ, కాంజుగేట్ వ్యాక్సిన్‌లు, ప్రెసిషన్ డెలివరీ టెక్నాలజీలో పురోగతితో సహా ఆకట్టుకునే అంశాలపై కీలకోపన్యాసాలు జరిగాయి. ఏఐ, క్వాంటం సాంకేతికతలు, తదుపరి తరం డేటా వేదికలు ఔషధ ఆవిష్కరణ, రోగ నిర్ధారణలు, రోగి సంరక్షణను ఎలా మార్చగలవో నిపుణులు చర్చించారు.
రోజంతా, కీలకమైన ప్రపంచ ఆరోగ్య సంరక్షణ నేపథ్యాలతో ప్రభావవంతమైన చర్చా కార్యక్రమాల శ్రేణిని టీఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026 నిర్వహించింది. వీటిలో ఈ దిగువ అంశాలు వున్నాయి…
ఆరోగ్య సంరక్షణలో క్వాంటం అండ్ ఏఐ వాస్తవ స్థితి.
దీర్ఘాయువు అండ్ ఆరోగ్యం అండ్ వయోధికుల సంరక్షణలో పరివర్తన.
ప్రపంచ వైద్య పర్యాటక పరిశ్రమలో భారతదేశం వ్యూహాత్మక పాత్ర.
మానసిక ఆరోగ్యం – బర్న్అవుట్, డిజిటల్ జోక్యాలు, అపోహల తగ్గింపు అండ్ ఆరోగ్య వ్యవధిని మెరుగుపరచడం.
ఆరోగ్య సంరక్షణ కోసం కమ్యూనిటీ ఛేంజ్ మేకర్స్ ను ప్రోత్సహించటం.
ఈ సదస్సులో కీలకవక్తలుగా మార్క్ లీ (సోలిక్స్ టెక్నాలజీస్), నిషిత్ దేశాయ్ అండ్ మిహిర్ పారిఖ్ (నిషిత్ దేశాయ్ అసోసియేట్స్ ), అండ్ డాక్టర్ రమేష్ మాటూర్ (myRNA థెరప్యూటిక్స్) ఉన్నారు. ఈ చర్చా కార్యక్రమాలను ఉదయ్ సక్సేనా (వేల్ ట్యాంక్ బయోక్యాటలిస్ట్), మురళీ కృష్ణం, జో లాంకాస్టర్, రాజు పూసపాటి (సోలిక్స్ టెక్నాలజీస్), డాక్టర్ బాల విద్యాధర్ మల్లాది (పుష్పగిరి విట్రియో రెటినా ఇన్స్టిట్యూట్), గోపాల్ గార్గ్ (అశోక) మోడరేట్ చేశారు. డాక్టర్ ఎవిటా ఫెర్నాండెజ్ (ఫెర్నాండెజ్ హాస్పిటల్), అన్షు గుప్తా (గూంజ్), దీపిక టి. గ్రంధి (క్లీవ్‌ల్యాండ్ క్లినిక్) భారతదేశం, అంతర్జాతీయంగా ఉన్న ఆరోగ్య సంరక్షణ నాయకులతో సహా 30మందికి పైగా ప్రముఖ ప్యానలిస్టులు పాల్గొన్నారు.
గౌరవ తెలంగాణ ప్రభుత్వ ఐటిఈ అండ్ సి, పరిశ్రమలు అండ్ వాణిజ్యం, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రసంగంతో ఈ కార్యక్రమం ముగిసింది. టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ ఆరోగ్య సంరక్షణ ప్రదాతలు, వెల్నెస్ ప్రాక్టీషనర్లు, పరిశోధకులు, స్టార్టప్‌లు, లాభాపేక్షలేని సంస్థలు అండ్ ప్రపంచ సంస్థల కోసం ఆలోచనలను మార్పిడి చేసుకోవడానికి, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, సమానమైన ఆరోగ్య సంరక్షణ అవకాశాలను వేగవంతం చేయడానికి సహకార వేదికగా పనిచేస్తూనే ఉంది.
