dammapeta | గట్టు గూడెం గుట్టపై శివలింగం దర్శనం

దేవుణ్ణి చూడటానికి వెళ్తున్న చుట్టు పక్కల ప్రజలు

భక్తులను వెళ్ళనీయకుండా అడ్డుకుంటున్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు
బీజేపీ ,హిందూ సంఘాల ఆధ్వర్యంలో పూజలు

దమ్మపేట , ఫిబ్రవరి 16(ఆంధ్రప్రభ ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ,అశ్వారావుపేట నియోజక వర్గం ,దమ్మపేట మండలం గట్టు గూడెం గ్రామ శివారులోని గుట్ట మీద శివ లింగం ఫిబ్రవరి 14న శనివారం ఆప్రాంత గిరిజనులకు కనిపించింది.శివ లింగాన్ని చూడటానికి ఫారెస్ట్ అధికారులు అడ్డుపడుతున్నారని, ఫారెస్ట్ లోనికి రానివ్వటం లేదని గిరిజనులు ఆరోపించారు .

శివ లింగమును చూడటానికి అటవీ ప్రాంతం లోనికి ఫారెస్ట్ అధికారులు భక్తులను వెళ్లనీయకుండా అడ్డుకొనడంతో గ్రామస్థులు హిందూ సంఘాలకు తెలిపారు . గ్రామస్థులకు అండగా బీజేపీ , హిందూ సంఘాల కలిసి సోమవారం గుట్ట మీద వెలసిన శివలింగం దగ్గరకు వెళ్ళి శివలింగాన్ని దర్శించుకొని ,పాలాభిషేకం చేసి పూజలు నిర్వహించారు.భక్తులకు, గ్రామస్థులకు బీజేపీ పార్టీ, హిందూ సంఘాలు అండగా ఉంటాయని, దేవుడు విషయంలో ఎవరు ఇబ్బంది పెట్టినా తాము అండగా ఉంటామని బీజేపీ నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి,సీనియర్ నాయకులు ఉడతనేని విశ్వేశ్వరరావు,రామదండు మహిళ అధ్యక్షురాలు నాగవర్ధనమ్మతెలిపారు .ఈ కార్యక్రమంలో చారి ,మల్లేశ్,గ్రామస్థులు,భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply