Maktal | చైర్ పర్సన్ దంపతులను….

Maktal | చైర్ పర్సన్ దంపతులను….
Maktal | ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లామక్తల్ మున్సిపల్ చైర్ పర్సన్ గా వాకిటి మానసహన్మంతు సోమవారం పదవీ ప్రమాణస్వీకారం చేయడంతో ఊట్కూర్ మండల పరిధిలోని మల్లేపల్లి సర్పంచ్ కథలప్ప సోమవారం చైర్పర్సన్ దంపతులను ఘనంగా సన్మానించి అభినందించారు.
రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సహకారంతో మక్తల్ మున్సిపాలిటీ అభివృద్ధికి కృషిచేయాలనిఅన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నాగార్జున్, సేక్షన్ కిష్టయ్య, మల్లికార్జున్, ఆంజనేయులు, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
