TG | రేవంత్ నిజాయితీ గ‌ల మోస‌గాడు… అందుకే అంద‌రూ మోస‌పోయారు: కెటిఆర్

ఆమ‌న్‌గ‌ల్ : ఆడ‌బిడ్డ‌ల‌కు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా రేవంత్ రెడ్డి నెర‌వేర్చ‌లేద‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిప‌డ్డారు. అవ‌స‌రమైతే రేపోమాపో రేవంత్ రెడ్డి ఆడ‌బిడ్డ‌ల పుస్తెల తాడు కూడా ఎత్తుకుపోత‌డు అని కేటీఆర్ సెటైర్లు వేశారు. ఆమ‌న్‌గ‌ల్‌లో నేడు జ‌రిగిన రైతు దీక్ష ఆయ‌న మాట్లాడుతూ, ఆడ‌బిడ్డ‌ల‌కు అర‌చేతిలో స్వ‌ర్గం చూపిండు రేవంత్ రెడ్డి.. అత్త‌కు రూ. 4 వేలు.. కోడ‌లికి రూ. 2500 అన్నాడు. రూ. 500కు సిలిండ‌ర్ అన్న‌డు. 200 యూనిట్ల క‌రెంట్ ఫ్రీ అన్న‌డు.. ఇప్ప‌టి వ‌ర‌కు ఏది లేదు. 35 సార్లు ఢిల్లీకి వెళ్లి వ‌చ్చిండు త‌ప్ప 35 పైస‌లు ఢిల్లీ నుంచి తేలేదు అని కేటీఆర్ విమ‌ర్శించారు. కేసీఆర్ పాల‌న‌లో ఇదే క‌ల్వ‌కుర్తి తాలుకాలో, పాల‌మూరు జిల్లాల్లో రివ‌ర్స్ మైగ్రేష‌న్ ప్రారంభ‌మై వేరే రాష్ట్రాల నుంచి కూలీలు వ‌చ్చార‌న్నారు. కానీ రేవంత్ పాల‌న‌లో ఏడాది తిర‌గ‌క ముందే.. లోన్ క‌ట్ట‌లేద‌ని చెప్పి ఇంటికాడ గేట్ ఎత్తుకు పోయార‌ని గుర్తు చేశారు..

రేవంత్ నిజాయితీ క‌లిగిన మోస‌గాడు ..

సీఎం రేవంత్ రెడ్డి నిజాయితీగ‌ల్ల మోస‌గాడు అని కేటీఆర్ సెటైర్లు వేశారు. నంగ‌నాచి, దొంగ, మోస‌పు మాట‌లు చెప్పి అధికారంలోకి రావాల‌ని అర‌చేతిలో స్వ‌ర్గం చూపించి గెలిచారు అని కేటీఆర్ అన్నారు. మోస‌గాళ్ల‌ను న‌మ్ముత‌రు.. అందుకే మోసం చేస్తున్నాన‌ని అన్నారు. ఇక తెలుగు భాష‌లో ఇన్ని తిట్లు ఉంటాయ‌ను కోలేద‌ని. కొంద‌రు తిట్లను చూస్తే రోషం ఉన్నోడు అయితే పాడుబాడ్డ బావిలో దుంకి చ‌నిపోతేడు. సిగ్గు ల‌జ్జ లేని బ‌తుకు కాబ‌ట్టి బ‌తుకుతుండు రేవంత్ రెడ్డి. ఇన్ని తిట్లు తిన్న సీఎంను ఇప్ప‌టి వ‌ర‌కు చూడ‌లేదు అని కేటీఆర్ పేర్కొన్నారు.

కుల‌గ‌ణ‌న పేరుతో బిసిలకూ మోసం

కుల‌ణ‌గ‌న పేరిట బీసీల‌ను మోసం చేసిండ‌ని కెటిఆర్ ఆన్నారు. 420 రోజుల్లో 430 మంది రైతులు ఆత్మ‌హ‌త్య చేసుకున్నార‌ని గుర్తు చేశారు… మ‌న పిల్ల‌లు విదేశాల‌కు పోయి ఉన్న‌త చ‌దువులు చదువుకోవాల‌నే ఉద్దేశంతో తెలంగాణ‌లో 1022 గుకులాలు స్థాపించి, ఒక్కో విద్యార్థి మీద‌ ల‌క్షా 20 వేలు కెసిఆర్ ఖ‌ర్చు పెట్టార‌న్నారు. గురుకుల విద్యార్థులంతా ఐఐటీ, నీట్‌, ఐఐఎంలో పాసై పెద్ద చ‌దువులు చ‌దివార‌ని అయితే రేవంత్ స‌న్నాసికి గురుకులాల‌ను న‌డ‌ప‌డానికి వ‌స్త‌లేద‌ని దుయ్య‌బ‌ట్టారు. గురుకులాల్లో 56 మంది పిల్ల‌లు చ‌నిపోయార‌ని, . దీన్ని బ‌ట్టి కాంగ్రెస్ పాల‌న ఎంత నికృష్టంగా ఉందో తెలుస్తుంది అని అన్నారు.

రియ‌ల్ ఎస్టేట్ పైనే రేవంత్ కు ప్రేమ …

సిఎంకు రేవంత్ రెడ్డికి స్వార్థం త‌ప్ప ఇంకోటి తెలియ‌ద‌న్నారు కెటిఆర్.. రియ‌ల్ ఎస్టేట్ త‌ప్ప‌.. స్టేట్ ఫిక‌ర్ లేదు అని బీఆర్ఎస్ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లాలో రుణ‌మాఫీ కాక చందు అనే రైతు బ్యాంక్ ముందు బైక్ కాల‌బెట్టి నిర‌స‌న చెప్పిండు. ఆదిలాబాద్‌లో జాద‌వ్ రావు అనే రైతు బ్యాంకులోనే ఎండ్రిన్ తాగి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. మేడ్చ‌ల్‌లో సురేంద్ రెడ్డి అనే రైతు వ్య‌వ‌సాయ శాఖ కార్యాల‌యంలోనే సూసైడ్ చేసుకున్నాడు. చివ‌ర‌కు రియ‌ల్ ఎస్టేట్ ఏజెంట్ వేణోగోపాల్ రెడ్డి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ ద‌రిద్ర‌పు పాల‌న‌లో ఏ ఒక్క వ‌ర్గం కూడా సంతోషంగా లేదు. ద‌య‌చేసి మ‌ళ్లీ మోస‌పోవ‌ద్దు అని కేటీఆర్ సూచించారు.

గ‌ల్లా ప‌ట్టుకు నిల‌దీయాల్సిందే ..

మ‌ళ్లీ ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ, పంచాయ‌తీ ఎన్నిక‌లు వ‌స్తున్నాయి కాబ‌ట్టి.. ఎక‌రం, అర ఎక‌రానికి పైస‌లు వేస్తుండు. ఒక్క విష‌యం గుర్తు పెట్టుకోండి.. కాంగ్రెస్ ప్ర‌భుత్వం రైతుల‌కు బాకీ ప‌డ్డ‌ది ఒక్కొక్క ఎక‌రానికి రూ. 17500. మ‌ళ్లా న‌మ్మి మోస‌పోతే.. మ‌న‌ల్ని ఎవ‌రు కాపాడ‌లేదు. పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ఓట్ల కోసం ఇంటికొచ్చే కాంగ్రెస్ నాయ‌కుల‌ను గ‌ల్లా ప‌ట్టి అడ‌గండి.. రైతు బంధు, తులం బంగారం, 2500 ఎక్క‌డా అని అడ‌గాలి.. స్కూటీలు ఏమైన‌య్ అని ప్ర‌శ్నించాలి. స్కూటీలు లేవు కానీ లూటీ మాత్రం బాగా న‌డుస్తుంది. తుక్కుగూడ నుంచి ఇక్క‌డి దాకా.. రేవంత్ రెడ్డి ఆయ‌న సోద‌రులు ఫోర్త్ సిటీ.. ఫ్యూచ‌ర్ సిటీ.. ఏఐ సిటీ అని డ్రామా చేస్తుండ్రు. ఇలాంటి రేవంత్ రెడ్డిని అస‌లు న‌మ్మ‌కండి అని కేటీఆర్ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *