Chairperson | ఏల్లంపేట్ మున్సిపల్ చైర్ పర్సన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైనా శ్రీదేవి..

Chairperson | ఏల్లంపేట్ మున్సిపల్ చైర్ పర్సన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైనా శ్రీదేవి..
అట్టహాసంగా మున్సిపల్ ప్రమాణ స్వీకారం..
వైస్ చైర్ పర్సన్ గా మేకల రజిత
24 మంది కౌన్సిలర్ల ప్రమాణస్వీకారం…
Chairperson | మేడ్చల్,ఆంధ్రప్రభ: మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడ్చల్ మండలంలోని ఎల్లంపేట మున్సిపల్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా కొనసాగింది.. ఈ కార్యక్రమంలో ఎక్స్ అఫీషియో మెంబర్గా మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి ఓటేసి పాల్గొన్నారు.ఎన్నికల సంఘం నిర్దేశించిన నియమావళి ప్రకారం ముందుగా కౌన్సిలర్గా ఎన్నికైన 24 మంది చేత ప్రత్యేక ఎన్నికల అధికారి చంద్రశేఖర్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన చైర్మన్ అభ్యర్థికి మెజార్టీ సభ్యులు మద్దతు తెలపడంతో ఎల్లంపేట మున్సిపల్ చైర్మన్, 8 వ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి లావుడ్య శ్రీదేవి రమేష్ లాంచనంగా ఎన్నికయ్యారు. బిజెపి పార్టీకి చెందిన 19 వ. వార్డు సభ్యులు మేకల రజిత దేవేందర్ రెడ్డి కి నరసింహ ప్రతిపాదించగా బిందెల కుమార్ మద్దతు తెలిపగా. అనంతరం కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు వాకట్ చేసి వెళ్లిపోయారు…. వైస్ చైర్ పర్సన్ గా మేకల రజిత దేవేందర్ రెడ్డి ఎన్నికైనట్టు ఎన్నికల ప్రత్యేక అధికారి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ స్వామి నాయక్ నూతనంగా ఎన్నుకోబడ్డ మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

