నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ దీపక్ తివారి

వికారాబాద్, ఆంధ్రప్రభ : భగీరధుడు మహా జ్ఞాని అని పరోపకారానికి ఆయన పెట్టింది పేరని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. గురువారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో రాజశ్రీ భగీరథ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ దీపక్ తివారి మాట్లాడుతూ.. భగీరథుడు ఎంత కష్టానైనా లెక్కచేయకుండా అనుకున్నది సాధించే వ్యక్తిత్వం కల మహా వ్యక్తి అని కలెక్టర్ కొనియాడారు. ఎవరైనా కటోర పరిశ్రమ చేసిన దేన్నైనా సాధిస్తే భగీరథ ప్రయత్నం చేశారని మనం చెప్పుకుంటామని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, డిపిఓ జయసుధ, డిడబ్ల్యూఓ కృష్ణవేణి, డిపిఆర్ఓ చెన్నమ్మ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
