29th Ward | మేడి పున్నంచంద్రు ప్రమాణ స్వీకారం

29th Ward | మేడి పున్నంచంద్రు ప్రమాణ స్వీకారం
29th Ward | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి మున్సిపాలిటీ 29వ వార్డు కౌన్సిలర్‌గా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ నాయకుడు మేడి పున్నంచంద్రు సోమవారం ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల అధికారి, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ సమక్షంలో ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ ఆయనతో కౌన్సిలర్‌గా ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మేడి పున్నంచంద్రు మాట్లాడుతూ.. 29వ వార్డు ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిరంతరం ప్రజా సేవలో ఉంటానని స్పష్టం చేశారు.
బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ గారి సంపూర్ణ సహకారంతో వార్డులో పెండింగ్‌లో ఉన్న సమస్యలన్నింటినీ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వినోద్ గారి మార్గదర్శకత్వంలో 29వ వార్డును అభివృద్ధి పథంలో నడిపించి, ఆదర్శవంతమైన వార్డుగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి అందేలా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పున్నంచందర్‌కు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.
