Help | ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్న శ్రీనివాస్ రెడ్డి

Help | ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్న శ్రీనివాస్ రెడ్డి
చదువుల తల్లికి ఆసరాగా నిలిచిన ఎన్ఆర్ఐ కుంభం శ్రీనివాస్ రెడ్డి
Help | మర్రిగూడ, ఆంధ్రప్రభ: ఇందుర్తి మేటిచందాపురం గ్రామానికి చెందిన లపంగి శ్రీనుపార్వతమ్మ దంపతుల కూతురు శివానికి కామారెడ్డి మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు లభించింది. ఇటీవల నీట్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించి ఎంబీబీఎస్ చదువుతున్న శివాని విద్యాభ్యాసానికి పేదరికo పరిస్థితులు అడ్డంకిగా మారాయి ఇట్టి విషయాన్ని గ్రామ మాజీ ఎంపీటీసీ ఊరిపక్క సరితనగేష్ గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ కుంభం శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎన్ఆర్ఐ శ్రీనివాస్ రెడ్డి ఆమెకు అండగా నిలిచి యాభైవేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనంతరం శివాని కుటుంబ సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు.
