శివాలయాల్లో మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు

దండేపల్లి, ఆంధ్రప్రభ ; హర హర మహాదేవ… శంభో శంకర అంటూ భక్తుల శివనామ స్మరణతో మండలంలోని శైవక్షేత్రాలు మారుమోగాయి.మహా శివరాత్రి ఉత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి.దండేపల్లి మండలంలోని ద్వారక, నర్సాపూర్, మేదరిపేట, లక్ష్మీకాంతపూర్, గూడెం,ఆలయంలో మహాశివరాత్రి జాగరణ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండే భక్తులు బాల రాజేశ్వరుడిని దర్శించుకున్నారు. ఉదయం నుండే భక్తులు గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి, ఆలయల వద్ద పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరారు.

మహా శివరాత్రి పర్వదినం కావడంతో వేలాది మంది భక్తులు తరలిరావడంతో ఆలయాలు కిటకిటలాడాయి.కొంతమంది భక్తులు స్వామి అభిషేకాలు చేసారు, ద్వారక దత్తాత్రేయ స్వామి ఆలయంలో రాత్రి భజన కీర్తనలను నిర్ నిర్వహించారు,ద్వారక సర్పంచ్ మురిమడుగు సత్యనారాయణ ఆధ్వర్యంలో, గోదావరి పుణ్య స్నానాలకు వచ్చిన భక్తులకు శవర్లు ఏర్పాటు చేశారు, మహిళలకు బట్టలు మార్చుకోవడానికి ప్రత్యేక గదులను ఏర్పాటు చేశారు,లక్షేటిపేట సిఐ రమణమూర్తి, దండేపల్లి ఎస్సై తహసినోద్దీన్, ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు,
