కాశీవిశ్వేశ్వరుడికి ప్రత్యేక పూజలు..

గట్టుప్పల, ఆంధ్రప్రభ : నల్గొండ జిల్లా గట్టుప్పల మండలం నామాపురం గ్రామంలో పురాతన శ్రీ కాశి విశ్వేశ్వర స్వామి దేవాలయంలో చండూరు ఆర్డీవో శ్రీదేవి కుటుంబ సమేతంగా ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు.దేవాలయ పునర్నిర్మాణదాత హైదరాబాద్ వాస్తవ్యులు పొద్దుటూరి వీరేశం గుప్త ధర్మపత్రి శైలజ గుప్త 2017లో దేవాలయం పునర్ నిర్మాణం చేయించడంతో నాటి నుండి నేటి వరకు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అశేష భక్తావనితో విరాజిల్లుతుండడంతో ఈరోజు చండూరు రెవెన్యూ డివిజన్ అధికారి భర్త శ్రవణ్ కుమార్ తో కలిసి శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దేవాలయ అర్చకులు స్వామివారి ఆశీర్వచనం తో పాటు తీర్థ ప్రసాదాలను అందజేసి ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రాములు గట్టుప్పల సర్పంచ్ నామని జగన్నాథం,తేరటుపల్లి సర్పంచ్ సింగం వెంకటేశం,నామపురం సర్పంచ్ భీమనపల్లి రామయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు,మాజీ సర్పంచ్ కంచుకట్ల సంపత్,గుడి నిర్మాణదాత పొద్దుటూరి వీరేశం గుప్త ధర్మపత్ని శైలజ గుప్త, దేవాలయ కమిటీ అధ్యక్షులు చెనగోని యాదయ్య,మాజీ సర్పంచ్ మలిగే శ్రీశైలం,రాష్ట్ర ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి కన్వీనర్ కంచుకట్ల సుభాష్,ఉప సర్పంచ్ కంచుకట్ల సుదర్శన్,మాజీ ఎంపిటిసి భీమనపల్లి రాములు,మాజీ ఉప సర్పంచ్ సురిగి యాదయ్య,మహేశ్వరం సురేష్,రాపోలు ఆంజనేయులు,మారోజు వెంకటాచారి,కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు జాజుల యాదయ్య,గ్రామ ప్రజలు,భక్తులు తదితరులు పాల్గొన్నారు.
