Temple | మహా శివరాత్రి వేడుకలు
Temple | మహా శివరాత్రి వేడుకలు
Temple | మోపిదేవి – ఆంధ్రప్రభ : మోపిదేవి మండలం కే.కొత్తపాలెంలోని శ్రీ దుర్గా కోటేశ్వర స్వామి వారి దేవస్థానంలో మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ విచ్చేసి, శ్రీ దుర్గా కోటేశ్వర స్వామి వారిని దర్శించుకుని పూజలు జరిపించుకున్నారు. ఆలయ వ్యవస్థాపకురాలు రామిశెట్టి నాగరాణి – రామకృష్ణ దంపతులు ఆయనను ఘనంగా సత్కరించారు.
ఆలయ అధ్యక్షులు చందన రామచంద్రయ్య, ట్రస్ట్ బోర్డ్ సభ్యులు మత్తి శ్రీనివాసరావు, బచ్చు హరికృష్ణ ప్రసాద్, మత్తి ప్రసాదరావు, బాలకృష్ణ, కొక్కిలిగడ్డ శ్రీనివాసరావు ఏర్పాట్లు పర్యవేక్షించారు. కార్యక్రమంలో పీసీ చైర్మన్ దేవనబోయిన వెంకటేశ్వరరావు, పీఏసీఎస్ చైర్మన్ పూషడపు రత్నగోపాల్, కూటమి నాయకులు పాల్గొన్నారు.

