Minister | నిజామాబాద్, కరీంనగర్ లో బీజేపీకి మెజారిటీ లేదు

Minister | నిజామాబాద్, కరీంనగర్ లో బీజేపీకి మెజారిటీ లేదు
- మంత్రి పొన్నం ప్రభాకర్
Minister | వేములవాడ, ఆంధ్రప్రభ ; నిజామాబాద్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లలో బిజెపికి మెజారిటీ లేదని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నిజామాబాద్ కార్పొరేషన్ లో 60 సీట్లు ఉన్నాయని 28 సీట్లతో బీజేపీ ఉందన్నారు. అక్కడ పార్లమెంట్ సభ్యుడు మెజారిటీ లేదని ప్రతిపక్షం లో కూర్చుంటామన్నారన్నారు. మిగతా సీట్లను కాంగ్రెస్ తో పాటు మిగతా పార్టీలు అన్ని గెలిచాయన్నారు. అక్కడ ఏమవుతుందని భవిషత్ నిర్ణయిస్తుందన్నారు.
కరీంనగర్ లో మేమే గెలిచామని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రకటించుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మొత్తం కరీంనగర్ కార్పొరేషన్ లో 66 సీట్లు ఉన్నాయని, కరీంనగర్ ఎంపీ తోపాటు స్థానిక ఎమ్మెల్యే మానకొండూర్ ఎమ్మెల్యేలకు ఓటు హక్కు ఉందన్నారు.అంటే మొత్తం 69 సభ్యులకు గాను బీజేపీ కి 30 సీట్లు మాత్రమే ఉన్నాయన్నారు. రాజకీయ పార్టీ నాయకుడిగా పార్లమెంట్ సభ్యుడిగా కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ అవుతామని ఎలా ప్రకటించుకున్నారో తెలియడం లేదన్నారు. వాళ్ళ లాగే మిగతా పార్టీలకు వ్యూహాలు ఉంటాయని, అవినీతిపరులను వాళ్ల పార్టీలో ఎలా చేర్పించుకొని పునీతులయ్యారో ప్రజలకు చెప్పాలన్నారు.
రాజకీయ పార్టీ గా గతంలో మేము 13 సీట్లు గెలిచినప్పుడు కూడా కరీంనగర్ లో మేయర్ అయ్యామని గుర్తు చేశారు.ఇప్పుడు కూడా అన్ని రాజకీయ పార్టీల నాయకులు రాష్ట్ర ప్రభుత్వం సలహా సూచనల మేరకు వ్యవహరిస్తాంమని,ముఖ్యమంత్రి మంత్రుల జోక్యం లేదన్నారు. స్థానికంగా గెలిచిన ప్రజా ప్రతినిధులు వారి ఆలోచనకనుగుణంగా వ్యవహరిస్తామన్నారు. నిజామాబాద్ లో మెజారిటీ లేదు, ఇక్కడ 69 కి 30 వచ్చాయన్నారు. నిజామాబాద్ లో లాగా ఇక్కడ కూడా ప్రతిపక్షంలో కూర్చుంటామని చెప్పాల్సి ఉండేదన్నారు. డెమోక్రటిక్ గానే గెలిచిన కార్పొరేటర్లు మేయర్ ను ఎన్నుకుంటారు కానీ ముఖ్యమంత్రి ,మంత్రులు ,ప్రజా ప్రతినిధులను తిరగనీయం అనేది సరైనది కాదన్నారు.
మీరు ఇండిపెండెడ్ లను కలుపుకోవడం అనైతికం కాదా..?
మెజారిటీ లేక ముందే జెండా ఎగురవేశామని మీరే కదా చెప్పింది. స్వతంత్ర అభ్యర్థులను కలుపుకోవడం అనైతికత కాదా. ఆయా రాజకీయ పార్టీలకు పొత్తులు ఉంటాయి. 16వ తేది ఏమవుతుందో చూద్దాం.ఎన్నిక కాగానే చాలా చోట్ల క్యాంప్ జరిగింది.. ఇప్పుడు కొత్తగా క్యాంప్ లు ఎర్పాటు చేయలేదు.
