Ghanapuram | ఘనంగా మహా శివరాత్రి వేడుకలు..

Ghanapuram | ఘనంగా మహా శివరాత్రి వేడుకలు..
Ghanapuram, ఆంధ్రపభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం లక్ష్మారెడ్డి పల్లిలోని శ్రీ రామలింగేశ్వర సహిత అభయాంజనేయ స్వామి దేవాలయంలో మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మార్మోగుతోంది. తెల్లవారుజాము నుంచే అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తూ తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు.
ఆలయాన్ని ప్రత్యేక అలంకరణలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయగా, భక్తులు నియమ నిష్ఠలతో ఉపవాస దీక్షలు చేపట్టి స్వామివారి సేవలో పాల్గొంటున్నారు. మహా శివరాత్రి సందర్భంగా ఆలయ పూజారి బలబత్తుల రాజ్ కుమార్, ఆలయ కమిటీ భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక వసతులు ఏర్పాటు చేసి పర్వదినాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు.
