Rahul Gandhi| స్థిరంగా ‘ప్రజల తెలంగాణ’ లక్ష్యం

Rahul Gandhi| స్థిరంగా ‘ప్రజల తెలంగాణ’ లక్ష్యం

Rahul Gandhi | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ : పురపాలక, నగరపాలక సంస్థల ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. మొత్తం 2,582 మున్సిపల్ వార్డులకు గాను కాంగ్రెస్ 1,347, బీఆర్ఎస్ 717, బీజేపీ 261 వార్డులను గెలుచుకున్నాయి. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలకు గాను కాంగ్రెస్ పార్టీ 64 చోట్ల జయకేతనం ఎగురవేసింది. అలాగే 7 కార్పొరేషన్లలో మూడింటిని కైవసం చేసుకుంది. మంచాల, రామగుండం, నల్గొండ కార్పొరేషన్లు హస్తం ఖాతాలో చేరాయి. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కేవలం 13 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లతో సరిపెట్టుకుంది. మరో 38 మున్సిపాలిటీల్లో ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యం లభించలేదు.

ఈ ఫలితాలపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇవాళ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ ఫలితాలు తమ పార్టీ సంక్షేమ పాలనకు, తెలంగాణ నమూనాకు ప్రజలు ఇచ్చిన ఆమోదమని తెలిపారు. ఈ విజయం కాంగ్రెస్ కార్యకర్తలు, తెలంగాణ ప్రజలదని పేర్కొన్నారు. ప్రతి కుటుంబానికీ అభివృద్ధి ఫలాలు అందించాలనే తమ ‘ప్రజల తెలంగాణ’ లక్ష్యం స్థిరంగా ఉంటుందని హామీ ఇచ్చారు.

Leave a Reply