Chiru Chaithu Nikhil | ఆ మూడు సినిమాలకు విఎఫ్ఎక్స్ కష్టాలు..

Chiru Chaithu Nikhil | ఆ మూడు సినిమాలకు విఎఫ్ఎక్స్ కష్టాలు..

Chiru Chaithu Nikhil | విఎఫ్ఎక్స్ సినిమాలకు కొత్త కష్టాలు ఎందుకు?
ఓటీటీ సంస్థల కొత్త రూల్స్ ఏంటి?
నిర్మాతల్లో పెరుగుతున్న టెన్షన్
మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’కి విఎఫ్ఎక్స్ సమస్యలు
నాగచైతన్య ‘వృషకర్మ’ రిలీజ్ ఎప్పుడు?
నిఖిల్ ‘స్వయంభు’పై పెరుగుతున్న అంచనాలు
విఎఫ్ఎక్స్ కారణంగా పెరుగుతున్న బడ్జెట్
థియేటర్లలోకి ఎప్పుడు వస్తాయి ఈ క్రేజీ సినిమాలు?

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఇప్పుడు విఎఫ్‌ఎక్స్ సినిమాలకు కష్టాలు తప్పడం లేదు.. ఈ కష్టాలు దేని నుంచి అంటారా..? ఒకటి ఓటీటీ సంస్థల నుంచి.. రెండు ఆడియన్స్ నుంచి. ఓటీటీ సంస్థలు ఇంతకు ముందులా.. భారీగా అమౌంట్ ఇచ్చి కొనడం లేదు. పైగా కొన్ని రూల్స్ కూడా పెడుతున్నాయి. ఇప్పుడు ఓ మూడు సినిమాలు విఎఫ్ఎక్స్ వలన టెన్షన్ పడుతున్నాయట. ఇంతకీ.. ఓటీటీ సంస్థలు పెడుతున్న రూల్స్ ఏంటి..? ఆడియన్స్ నుంచి ప్రాబ్లమ్స్ ఏంటి…? ఇంతకీ.. విఎఫ్ఎక్స్ కారణంగా కష్టాలు తెచ్చుకున్న ఆ మూడు సినిమాలు ఏంటి..?

Chiru Chaithu Nikhil | టెన్షన్ లో నిర్మాతలు..

Chiru Chaithu Nikhil

ఇప్పుడు సినిమాలో ఏదో కొత్తదనం ఉంటేనే కానీ జనాలు థియేటర్స్ కి రావడం లేదు. అలా ఉండాలంటే.. విఎఫ్ఎక్స్ తో కూడిన సోషియో ఫాంటసీ మూవీనో, మిస్టిక్ థ్రిల్లరో చేయాలి. అయితే.. ఇలాంటి సినిమాలకు కష్టాలు మొదలయ్యాయి. విషయం ఏంటంటే.. ఓటీటీ సంస్థలు ఇలాంటి సినిమాలను జస్ట్ పై పైన చూసి తీసుకోము అని చెబుతున్నాయి. సినిమా మొత్తం చూపిస్తేనే ఎంతకి కొంటాం అనేది చెబుతుంది. విజువల్స్ లో క్వాలిటీ లేకపోతే తీసుకోవడం లేదు. ఓటీటీ సంస్థల నుంచి సరైన రేటు రాకపోతే ఇలాంటి సినిమాలకు నష్టాలు తప్పవు. అందుకనే.. నిర్మాతలు టెన్షన్ పడుతున్నారు.

Chiru Chaithu Nikhil | మెగాస్టార్ సీరియస్..

Chiru Chaithu Nikhil

విఎఫ్ఎక్స్ తో సినిమాలు తీసిన మూడు సినిమాలు ఇప్పుడు బాగా ఇబ్బంది పడుతున్నాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. ఆ మూడు సినిమాలు ఏంటంటే.. ముందుగా చెప్పుకోవాల్సింది మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర. ఈ సినిమాని బింబిసార డైరెక్టర్ మల్లిడి వశిష్ట్ తెరకెక్కించారు. ఈ సినిమా ఎప్పుడో రావాలి. అయితే.. గ్లింప్స్ రిలీజ్ చేసిన తర్వాత విజువల్స్ ఏమాత్రం బాలేదనే ఫీడ్ బ్యాక్ వచ్చింది. దీంతో చిరు లేట్ అయినా ఫరవాలేదు.. లేటెస్ట్ గా ఉండాలి.. మంచి క్వాలిటీ ఉండాలని చెప్పడంతో మళ్లీ విఎఫ్ఎక్స్ వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే.. లేటెస్ట్ అవుట్ ఫుట్ చూసిన చిరు.. ఏమాత్రం బాలేదని సీరియస్ అయ్యారని టాక్ వినిపిస్తోంది.

Chiru Chaithu Nikhil | చైతూ వృషకర్మ ఎప్పుడు..

Chiru Chaithu Nikhil

విఎఫ్ఎక్స్ కారణంగా ఇబ్బంది పడుతున్న మరో సినిమా నాగచైతన్య వృషకర్మ. కార్తీక్ దండు ఈ మూవీకి డైరెక్టర్. సీనియర్ ప్రొడ్యూసర్ భోగవల్లి ప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ మూవీ బడ్జెట్ 75 కోట్లు అనుకుంటే.. 100 కోట్లు దాటేసింది. అలాగే విఎఫ్ఎక్స్ కారణంగా లేట్ అవుతుంది. బడ్జెట్ పెరుగుతుంది. దీంతో సమ్మర్ కి రావాల్సిన ఈ సినిమా ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదు. విఎఫ్ఎక్స్ కారణంగా ఇబ్బంది పడుతున్న సినిమా నిఖిల్ స్వయంభు. ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ.. క్వాలిటీ కోసం చాన్నాళ్లు వెయిట్ చేశారు. దీని వలన బడ్జెట్ బాగా పెరిగింది. ఇలా.. విఎఫ్ఎక్స్ కారణంగా విశ్వంభర, వృషకర్మ, స్వయంభు చిత్రాలకు కష్టాలు తప్పలేదు. మరి.. ఈ కష్టాలు తట్టుకుని థియేటర్స్ లోకి ఎప్పుడు వస్తాయో.. ఎంత వరకు మెప్పిస్తాయో చూడాలి.

CLICK HERE TO READ MORE ఏం నేమ్స్ పెట్టారంటే?

Leave a Reply