న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : భారతదేశంలో ఉన్నత విద్యా వ్యాప్తి, అభివృద్ధి కోసం ప్రవాస భారతీయుడు అనిల్ అగర్వాల్ రూ. 21వేల కోట్లు విరాళం ప్రకటించారు. రాజస్థాన్‌లోని జైపూర్ నగరానికి చెందిన ఆయన లండన్‌లో స్థిరపడ్డారు. స్వదేశానికి ఏదో చేయాలన్న తపనతో విరాళం ఇస్తున్నట్లు తెలిపారు. ఈ డబ్బుతో ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ కంటే పెద్ద విశ్వవిద్యాలయాలు స్థాపించాలని సూచించారు. వాటిని ఎటువంటి ఆర్థిక లావాదేవీలు లేకుండా నిర్వహించాలని కోరారు. ఇప్పటివరకు భారతదేశంలో విద్య కోసం ఇచ్చిన విరాళాలలో ఇదే అతిపెద్ద విరాళం.
Delhi | ప్రవాస భారతీయుడు అనిల్ అగర్వాల్ ఔదార్యం – విద్యాభివృద్ధికి రూ.21వేల కోట్ల విరాళం
