america, iran| ఏ క్షణంలోనైనా దాడి

america, iran| ఏ క్షణంలోనైనా దాడి
- ఇరాన్ దిశగా కదులుతున్న అమెరికా సేనలు
- ఇరాన్‌లో టెన్షన్.. టెన్షన్
- చుట్టుముడుతోన్న అమెరికా సైన్యం
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఇంకా చల్లారటంలేదు. ఈ నేపథ్యంలో ఇరాన్ పై చర్యలకు అమెరికా సిద్ధమవుతోంది. ఇందులోభాగంగా ఇప్పటికే భారీస్థాయిలో అమెరికా సైన్యం ఇరాన్‌ను చుట్టుముట్టింది. తాజాగా అమెరికా విమాన వాహక నౌక యూఎస్‌ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ కరేబియన్ సముద్రం నుంచి ఇరాన్ వైపు కదిలినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. మే ప్రారంభం వరకు ఈ నౌక అక్కడే ఉండనున్నట్లు న్యూయార్క్ టైమ్స్ నివేదించింది.

ఇరాన్ పాలకులపై ఒత్తిడి పెంచేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే అగ్రరాజ్యానికి చెందిన యుద్ధ విమాన వాహక నౌక యూఎస్‌ఎస్ అబ్రహం లింకన్ ను పశ్చిమాసియాకు తరలించారు. తాజాగా జెరాల్డ్ ఆర్ ఫోర్డ్‌తో పాటు యూఎస్‌ఎస్ ఫ్రాంక్ ఈ పీటర్సన్ జూనియర్, యూఎస్‌ఎస్ స్ప్రూయాన్స్ డెస్ట్రాయర్లు, యూఎస్‌ఎస్ మిషెల్ మార్ఫీలను ఇరాన్ వైపు తరలిస్తుండడంతో అమెరికా ఏ క్షణాన దాడి చేస్తుందోనన్న భయాందోళనలు నెలకొన్నాయి.

