అక్కకొండ లక్ష్మీ నరసింహుడికి నిత్యం పూజలు..

కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలంలోని దిల్దార్ నగర్ గ్రామ సమీపంలో గల అరణ్య ప్రాంతంలో కొండ గుహ పై వెలిసిన అక్క కొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఆలయ అర్చకులు ఓద్దిపర్తి వెంకటరమణాచార్యులు ఆధ్వర్యంలో స్వామి వారికి ప్రతిరోజు పూజలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ అధ్యక్షులు కొప్పుల లక్ష్మణ్ తెలిపారు గతంలో స్వామివారికి వారానికి మంగళవారం శనివారం రెండు రోజులు పూజలు నిర్వహించేవారు భక్తుల కోరిక మేరకు ఆలయం కమిటీ నిర్ణయం మేరకు ప్రతిరోజు ఆలయానికి వెళ్లి స్వామివారికి పూజలు చేస్తున్నారు స్వామివారికి దర్శించుకుని పూజలు చేయాలని భక్తులు ప్రతిరోజు ఉదయం శ్రీ అక్క కొండ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి రావచ్చునని ఆలయ కమిటీ అధ్యక్షులు కొప్పుల లక్ష్మణ్ తెలిపారు.

Leave a Reply